లాక్ డౌన్ ఏప్రిల్ 15 వరకూ కొనసాగుతుందని ప్రధాని మంత్రి మోడీ ఇదివరకే తెలిపిన సంగతి తెలిసిందే. అప్పటి వరకూ నిత్యావసరాలకు జనాలు ఇబ్బందిపడతారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక షూటింగ్లు కూడా లేకపోవడంతో పేద కళాకారులు చాలా ఇబ్బంది పడుతున్నారు. వీరిని ఆదుకోవడానికి చిరంజీవి ఆధ్వర్యంలో సీసీసీ ని ఏర్పాటు చేసి.. సినీ కార్మికులను ఆదుకునేందుకు సిద్దం అయ్యారు మన టాలివుడ్ సెలబ్రిటీలు. ఈ క్రమంలో హీరోలంతా వారి వంతు విరాళాలను ప్రకటించారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ బ్రహ్మాజీ కూడా తాజాగా 75 వేల రూపాయలను ప్రకటించారు.
అయితే ఒక్క ప్రణీత, లావణ్య త్రిపాఠి వంటి హీరోయిన్లు తప్ప మిగిలిన వారెవ్వరూ .. ఈ నేపధ్యంలో ముందుకు రాకపోవడంతో.. వారి పై బ్రహ్మాజీ ఫైర్ అయ్యాడు. ఆయన మాట్లాడుతూ…”ఈ సమయంలో సినీ కార్మికులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరి పై ఉంది. కనీస అవసరాలకు కూడా డబ్బులు లేని వారికి సాయం చేయాలనే ఉద్దేశ్యం తో సీసీసీని ఏర్పాటు చేయడం నిజంగా అభినందించాల్సిన విషయం. అయితే ఇలాంటి టైములో కేవలం హీరోలు మాత్రమే విరాళాలు ఇస్తున్నారు.
పెద్ద మొత్తంలో పారితోషికాలు తీసుకునే హీరోయిన్స్ మాత్రం ఇప్పటి వరకూ విరాళాలు ఇవ్వడానికి ముందుకు రాలేదు. హీరోయిన్స్ సినీ కార్మికుల విషయంలో బాధ్యత లేదా. ప్రణీత, లావణ్య త్రిపాఠి వంటి హీరోయిన్స్ మాత్రమే ముందుకు వచ్చారు. మిగిలిన హీరోయిన్స్ కూడా ముందుకు వచ్చి విరాళాలు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా భారీగా పారితోషికాలను అందుకుంటూ ఉంటారు.అలాంటి వారు కూడా సీసీసీ కి విరాళం ఇవ్వడానికి ముందుకు రావాలి” అంటూ బ్రహ్మాజీ చెప్పుకొచ్చాడు.
Most Recommended Video
ఈ 17 ఏళ్లలో బన్నీ వదులుకున్న సినిమాలు ఇవే!
మన టాలీవుడ్ డైరెక్టర్స్ మరియు వారి భార్యలు!
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్