Maanas: ఈ రోజుల్లో సినిమా వదులుకొని తప్పు చేశాను: మానస్

బుల్లితెరపై పలు సీరియల్స్ లో నటిస్తూ ఎంతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నటువంటి మానస్ ప్రస్తుతం పలు సీరియల్స్ లో నటిస్తూ సందడి చేస్తున్నారు. ఇక ఈయన బిగ్ బాస్ కంటెస్టెంట్ గా కూడా వెళ్లిన సంగతి మనకు తెలిసిందే. ఇలా బిగ్ బాస్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి మానస్ ప్రస్తుతం బుల్లితెర సీరియల్స్ ద్వారా ఎంతో బిజీగా ఉన్నారు. అయితే ఈయన సీరియల్స్ లోకి రాకముందు సినిమాలలో కూడా నటించారు. ఇలా సినిమాల ద్వారా పెద్దగా గుర్తింపు సంపాదించలేకపోయారని చెప్పాలి.

ఇలా బుల్లితెర సీరియల్స్ ద్వారా ఎంతో బిజీగా ఉన్నటువంటి (Maanas) మానస్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఈయన తన సినీ కెరియర్ గురించి పలు ఆసక్తికరమైనటువంటి విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా మానస్ మాట్లాడుతూ మారుతి దర్శకత్వంలో వచ్చిన ఈ రోజుల్లో సినిమాలో హీరోగా నటించే అవకాశం ముందుగా తనకే వచ్చిందని అయితే మారుతి గారిపై తనకు నమ్మకం లేక ఈ సినిమా అవకాశం వదులుకున్నాను అంటూ కామెంట్ చేశారు.

మారుతి దర్శకత్వంలో శ్రీనివాస్, రేష్మ రాథోడ్ హీరో హీరోయిన్లుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఈ రోజుల్లో ఒక చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ద్వారా మారుతి డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. అనంతరం ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందారు. అయితే డైరెక్టర్ మారుతి ముందుగా ఈ సినిమా కథతో నా వద్దకే వచ్చారని మానస్ తెలిపారు.

ఈ సినిమా కథ వివరించినటువంటి ఆయన ఈ సినిమాని మొట్టమొదటిసారి డిజిట‌ల్ టెక్నాల‌జీలో ఫ‌స్ట్ టైమ్‌ 5డీ కెమెరాతో ప్ర‌యోగాత్మ‌కంగా సినిమాను చేయ‌బోతున్న‌ట్లు తెలియజేశారు. అయితే ఆయనపై నమ్మకం లేక తాను ఈ సినిమాని వదులుకున్నానని అయితే ఈ సినిమా మాత్రం ఎంతో మంచి సక్సెస్ అయిన తర్వాత తాను ఈ సినిమాని ఎందుకు మిస్ చేసుకున్నాన అని చాలా బాధపడ్డాను అంటూ ఈ సందర్భంగా మానస్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

బాలీవుడ్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునేది ఆ హీరోనేనా..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus