కమల్ త్రిభాషా చిత్రంలో తెలుగు సీనియర్ కమెడియన్..!

లోకనాయకుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో త్రిభాషా చిత్రంగా ఓ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రంలో కమల్ భార్య పాత్రలో రమ్యకృష్ణ నటించనుండగా.. తొలిసారి శృతి హాసన్ తన తండ్రితో కలిసి తెర పంచుకోనుంది.

తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం, కమల్ తో కలిసి నటించనున్నాడు. కామెడీ డ్రామాగా తెలుగు,తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కనుంది. టి‌కే రాజీవ్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. ఇళయ రాజా స్వరాలు సమకూరుస్తున్నారు.

రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. నడిగర్ సంఘం మైదానంలో ఈ చిత్రం గురువారం ప్రారంభం కానున్నట్లు సమాచారం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus