Brahmanandam: చదువు కోసం బ్రహ్మానందం అలాంటి పనులు చేశారా?

  • January 8, 2024 / 09:18 PM IST

టాలీవుడ్ కమెడియన్ నవ్వుల రారాజు హాస్యబ్రహ్మ బ్రహ్మానందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఈయన ఎన్నో వందల సినిమాలలో కమెడియన్ గా నటించి ఇండస్ట్రీలో ఎంతోమందిని ఆకట్టుకున్నారు. దాదాపు 1000 కి పైగా సినిమాలలో నటించినటువంటి బ్రహ్మానందం ప్రస్తుతం సినిమాలను పూర్తిగా తగ్గించేశారు ఇలా సినిమాలను తగ్గించి ఈయన ఎక్కువ సమయం తన కుటుంబంతో గడపడానికి ఇష్టపడుతున్నారు. బ్రహ్మానందం సినిమాలలోకి రాకముందు తెలుగు లెక్చరర్ గా పనిచేసిన సంగతి మనకు తెలిసిందే

అయితే ఇప్పుడు ఆయన తన తెలుగు పదాలన్నింటిని కూడా తన ఆత్మకథ రూపంలో ఒక పుస్తకాన్ని రాశారు ఆ పుస్తకానికి నేను మీ బ్రహ్మానందం అనే పేరుతో ఇటీవల ఆవిష్కరణ చేసిన సంగతి తెలిసిందే. ఈ పుస్తకంలో ఆయన పుట్టినప్పటినుంచి తనకి ఎదురైనటువంటి కష్టాలు ఇబ్బందులు తన చదువు కోసం పడిన శ్రమ అన్నింటిని కూడా పొందుపరిచారు. తన కుటుంబంలో ఎవరు చదువుకోలేదని తను మాత్రమే చదువుకున్నానని తెలిపారు. ఇక నేను మంచిగా చదువుకోవడంతో నా చదువుకు చాలామంది సహాయం చేశారు.

ఇలా బిఏ వరకు పూర్తి చేసిన నేను ఎం ఏ చదవడం కోసం ఆంధ్ర యూనివర్సిటీ కి వెళ్ళాను. అయితే ఆ సమయంలో ఒకవైపు చదువుకోవడానికి మరోవైపు నా ఖర్చులకోసం చాలా ఇబ్బందిగా మారింది దాంతో ఏదైనా పని చేసుకుంటూ చదువుకోవాలని భావించినట్లు బ్రహ్మానందం తన ఆత్మకథ పుస్తకంలో రాశారు. ఇలా కాలేజీకి వెళ్తున్నటువంటి దారిలో ఒక లారీ మెకానిక్ షాప్ కనిపించిందని అక్కడ మెకానిక్ పనులు చేయడమే కాకుండా లారీలకు పెయింటింగ్ కూడా వేస్తారని ఈయన తెలిపారు.

అలా అక్కడికి వెళ్లి ఏదైనా పని కావాలి అని అడిగినప్పుడు తనని వారికి సహాయకుడిగా చేర్చుకున్నారు అలా రెండు సంవత్సరాల పాటు పని చేస్తూ లారీలకు కూడా పెయింటింగ్స్ వేశానని ఈయన తెలిపారు. అప్పట్లో నెలకి ఇంత జీతం అని డబ్బు ఇచ్చే వాళ్ళు కాదు నేను ఆ రోజుకు ఎంత పని చేస్తే అంత డబ్బు ఇచ్చే వాళ్ళు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కాలేజీకి వెళ్లడం సాయంత్రం పనికి వెళ్లడం చేశాను

అప్పట్లో నాకు నాలుగు నుంచి ఐదు రూపాయల వరకు డబ్బు ఇచ్చే వారని అదే తన (Brahmanandam) మొదటి సంపాదన అంటూ బ్రహ్మానందం తెలిపారు. అప్పట్లో ఈ డబ్బు అంటే చాలా ఎక్కువే. అలా రెండు సంవత్సరాలు పూర్తి చేసి చదువు అయిపోగానే లెక్చరర్ గా మారిపోయాను అంటూ ఈయన చదువు కోసం తాను పడినటువంటి ఇబ్బందులను తెలిపారు.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus