Brahmanandam, Ali: అలీపై బ్రహ్మానందం సెటైర్లు.. భలే ఫన్నీ

బ్రహ్మానందం – అలీ.. ఈ కాంబినేషన్‌ ఎప్పటికీ ఎవర్‌ గ్రీన్‌. ఇద్దరూ ఒకేసారి స్క్రీన్‌ మీద కనిపించారు అంటూ పొట్ట చెక్కలవ్వాల్సిందే. అది సినిమా అయినా, టీవీ షో అయినా, స్టేజీ షో అయినా.. రిజల్ట్‌ మేం చెప్పిందే. తాజాగా ఇలాంటి పరిస్థితే వచ్చింది.. అయితే ఈ సారి ఓటీటీలో. ‘ఆహా’ కోసం మంచు లక్ష్మి చేస్తున్న ‘చెఫ్‌ మంత్రా’ అనే షోలో బ్రహ్మీ, అలీ గెస్ట్‌లుగా వచ్చారు. ఈ క్రమంలో ఇద్దరూ కలసి చేసిన సందడి మామూలుగా ఉండదు. ఈ ప్రోమోలో బ్రహ్మీ ఎక్స్‌ప్రెషన్స్‌ అయితే మరో లెవల్‌ అని చెప్పొచ్చు.

ఆహారపు అలవాట్లు, వంట, ఫన్‌.. ఇలా అన్నీ మిక్స్‌ అయ్యి.. ఈ షోను నడుపుతోంది మంచు లక్ష్మీ ప్రసన్న. ఈ క్రమంలో బ్రహ్మానందం, అలీ వచ్చాక ఫన్‌ కాస్త డబుల్‌ ఫన్‌ అయ్యింది. బ్రహ్మానందం హావభావాలు, పంచులు, సెటైర్లు… దానికి అలీ రియాక్షన్లు ఈ వారం స్పెషల్‌ అనుకోవచ్చు. లక్ష్మి అడిగే ప్రశ్నలకు అలీ, బ్రహ్మా వాళ్ల స్టైల్లో చెప్పిన సమాధానాలు చూసి.. ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలో బ్రహ్మీ వేసిన కొన్ని సైటైర్లు అదిరిపోయాయి.

అలీకి నచ్చిన తిండి ఏంటి, తలకాయ కూర ఎవరు తింటారు లాంటివి బాగా పేలాయి అని చెప్పొచ్చు. ‘‘ఆలీ గారికి బాగా ఇష్టమైన ఫుడ్ ఏంటి?’’ అని లక్ష్మి మంచు బ్రహ్మానందాన్ని అడగ్గానే ‘‘వీడు మనిషిని తప్ప అన్నీ తింటాడు’’ అని అనడంతో ఒక్కసారి నవ్వేశారు ముగ్గురు. ‘‘మిరపకాయ ఈజ్ ఈక్వల్ టూ గుంటూరు.. గుంటూరు ఈజ్ ఈక్వల్ టూ బ్రహ్మారందరావు’’ అని బ్రహ్మీ వెటకారంగా అన్నారు. వెంటనే లక్ష్మి మంచు.. ‘‘బ్రహ్మారంధ్రమా’’ అంటూ పంచ్‌ వేసింది.

బోటి కూర, లివర్ కూర, తలకాయ కూర అని లక్ష్మీ చెబుతుంటే మధ్యలో బ్రహ్మానందం అందుకుని ‘‘తలకాయ లేనోళ్లే.. తలకాయ కూర ఎవరు తింటారు’’ అని మరో పంచ్‌ వేశారు. ఇదంతా ఒకెత్తు అయితే.. ఇడ్లీ పిండి పోస్తున్నప్పుడు ఇంత స్లోగా వేస్తే ఓడిపోతారు అని బ్రహ్మీని లక్ష్మీ అంటే.. వేగంగా పిండి పోయడం.. అందంగా పని చేయాలి అంటే.. బ్రహ్మీ ఒయ్యారాలు ఒలకబోస్తూ వేయడం భలే ఉందసలు. కావాలంటే మీరూ చూడండి.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!


ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus