ఒకప్పుడు కామెడీ అనే పదానికి డెఫినిషన్ గా ఉండేవారు బ్రహ్మీ. ఆయన లేకపోతే స్టార్ హీరో సినిమాలో ఏదో వెలితి అన్నట్టు ప్రేక్షకులు ఫీలయ్యేవరు. అది ఎంత బ్లాక్ బస్టర్ సినిమా అయినా సరే అలాగే ఫీలయ్యేవరు. కేవలం ఈయన కోసమే అన్నట్టు దర్శకులు కామెడీ ట్రాక్ లు రాసుకున్న రోజులు కూడా ఉన్నాయి. అప్పట్లో బ్రహ్మీ డిమాండ్ అలా ఉండేది. క్షణం తీరిక లేకుండా బ్రహ్మీ 365 రోజులు బిజీగా గడిపేవారు. గంటకు లక్ష చొప్పున ఆయన రోజుకి 10 గంటలు పనిచేసేవారు.
అంటే రోజుకి ఆయన 10 లక్షలు సంపాదించే వాడన్న మాట. ఈయన కామెడీతోనే హిట్ అయిన సినిమాలు చాలానే ఉన్నాయి అంటే అతిశయోక్తి కాదు.అయితే తరువాత అతని డిమాండ్ చాలా వరకూ తగ్గింది. దాంతో అతను రోజుకి 5 లక్షలు డిమాండ్ చెయ్యడం మొదలుపెట్టాడు.అది కూడా ఒక్కో సినిమాకి. అందుకే స్టార్ హీరోల సినిమాల్లో ఇతనికి అవకాశాలు తగ్గాయి.ఇటీవల ఆయన జాతి రత్నాలు సినిమాలో కనిపించాడు. ఇందులో బ్రహ్మీ కామెడీ బాగుంది కానీ అతను చాలా వీక్ గా కనిపించాడు.
అయితే ఈ మూవీ కోసం బ్రహ్మీ ఎంత పారితోషికం అందుకున్నాడు అనే విషయం తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలోనూ ఉంది.అందుతున్న సమాచారం ప్రకారం.. జాతి రత్నాలు కోసం 5 రోజులు షూటింగ్లో పాల్గొన్నాడట బ్రహ్మీ. ఇందుకు గాను అతను 5 లక్షలు పారితోషికం తీసుకున్నాడట. అంటే రోజుకి లక్ష అన్న మాట. ఈ మధ్య కాలంలో ఒక్కో సినిమాకి 5 లక్షలు తీసుకుంటూ వచ్చిన బ్రహ్మీ.. ఇప్పుడు లక్షతో సరిపెట్టుకావాల్సి వచ్చిందన్న మాట. అలసిపోకుండా కూర్చుని చేసే పాత్రలే బ్రహ్మీ ఆశిస్తుండడంతో ఇంత తక్కువ దక్కుతున్నట్టు భోగట్టా.