హాస్య బ్రహ్మ అని పిలుచుకునే బ్రహ్మానందం గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆయన ప్లేస్ ని టాలీవుడ్లో ఎవ్వరూ రీప్లేస్ చేయలేకపోతున్నారు. ఇది వాస్తవం..! అయితే బ్రహ్మానందం వారసుడుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన రాజా గౌతమ్ మాత్రం హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తొలి ప్రయత్నంగా ‘పల్లకిలో పెళ్లి కూతురు’ అనే సినిమా చేశాడు. అది ఫ్లాప్ అయ్యింది. ఆ తర్వాత అతను ‘బసంతి’ ‘చారుశీల’ ‘మను’ వంటి సినిమాల్లో నటించాడు. ఇవేవీ ఆడలేదు.
అయితే ‘దూత’ వెబ్ సిరీస్లో.. ఇతను చేసిన పాత్రకి మంచి మార్కులు పడ్డాయి. ఇటీవల ఇతను నటించిన ‘బ్రేక్ అవుట్’ అనే సినిమా కూడా ఈటీవీ విన్..లో డిజిటల్ రిలీజ్ అయ్యింది. అది వచ్చినట్టు కూడా చాలా మందికి తెలీదు. మరోపక్క ఇతను తన తండ్రితో చేసిన ‘బ్రహ్మానందం’ అనే సినిమా త్వరలో రిలీజ్ కాబోతోంది. ఈరోజు టీజర్ లాంచ్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో రాజా గౌతమ్ గురించి ఒక షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు బ్రహ్మానందం.
విషయం ఏంటంటే.. శేఖర్ కమ్ముల డైరెక్షన్లో ‘గోదావరి’ అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఇది డీసెంట్ సక్సెస్ అందుకుంది. ఇప్పటికీ యూట్యూబ్ వంటి ప్లాట్ ఫామ్స్ లో ఆడియన్స్ ‘గోదావరి’ సినిమాని ఎక్కువగా చూస్తుంటారు. అలాంటి సినిమాలో హీరోగా మొదటి ఛాన్స్ రాజా గౌతమ్ కి వచ్చిందట.శేఖర్ కమ్ముల ఆ కథని ముందుగా రాజా గౌతమ్ కి చెప్పాడట. కానీ ఆ కథ హీరోయిన్ ఓరియెంటెడ్..లా ఉందని భావించి అతను రిజెక్ట్ చేశాడట.
ఆ తర్వాత వచ్చి బ్రహ్మానందంకి ఆ విషయం చెప్పాడట. రాజా గౌతమ్ నిర్ణయం సరైనది కాదు అని బ్రహ్మానందం గ్రహించినా.. ‘అది సరైన నిర్ణయం కాదు’ అని అతనితో చెప్పలేకపోయాడట. ఎందుకంటే ‘తన కొడుకు నిర్ణయాన్ని గౌరవించాలి’ అనే ఉద్దేశంతో తిరిగి ప్రశ్నించలేదట. బ్రహ్మానందం కామెంట్స్ ని బట్టి.. రాజా గౌతమ్ మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నాడని చెప్పాలి.
డైరెక్టర్ శేఖర్ కమ్ముల “గోదావరి” సినిమాలో హీరో రోల్ ఆఫర్ చేస్తే గౌతమ్ “హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా” అని వదులుకున్నాడు – బ్రహ్మానందం#Brahmanandam #Godavari #SekharKammula pic.twitter.com/exFcGd73AJ
— Filmy Focus (@FilmyFocus) January 16, 2025