ప్రముఖ కమెడియన్ బ్రహ్మానందం తన సినీ కెరీర్ లో ఏకంగా 1254 సినిమాలలో నటించారు. 422 మంది దర్శకుల డైరెక్షన్ లో బ్రహ్మానందం పని చేశారు. నటుడిగా బ్రహ్మానందం వందల పురస్కారాలను అందుకున్నారు. 1985 సంవత్సరంలో తాతావతార కథ అనే సినిమాలో నరేష్ స్నేహితుడి పాత్రలో తాను నటించానని అదే తన మొదటి సినిమా అని బ్రహ్మానందం చెప్పుకొచ్చారు. జంధ్యాల నాకు గురువు అని చెప్పుకోవడానికి తాను సంతోషిస్తానని బ్రహ్మానందం వెల్లడించారు.
నాన్న వడ్రంగి పని చేసేవారని పిల్లలకు ట్యూషన్ చెప్పేవారని బ్రహ్మానందం చెప్పుకొచ్చారు. అహ నా పెళ్లంట సినిమాలో కోట శ్రీనివాసరావు అసిస్టెంట్ రోల్ కు మొదట సుత్తివేలు గారిని అనుకున్నారని సినిమా ఓపెనింగ్ రోజున సుత్తివేలు రాకపోవడంతో తనకు ఆఫర్ దక్కిందని బ్రహ్మానందం చెప్పుకొచ్చారు. అహ నా పెళ్లంట సినిమాకు అవార్డ్ వచ్చిన సమయంలో నా ఆనందానికి అవధులు లేవని బ్రహ్మానందం పేర్కొన్నారు. సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్లు మాత్రమే కాకుండా మిగతా వాళ్లు కూడా డబ్బుకు విలువ ఇవ్వాలని చాలామంది డబ్బు విలువ తెలుసుకునే ప్రయత్నం చేయరని బ్రహ్మానందం తెలిపారు.
ఇండస్ట్రీలో రోజుకు 1250 రూపాయల కంటే తక్కువ మొత్తానికి పని చేసే టెక్నీషియన్ ఎవరూ ఉండరని అందులో 100 రూపాయలు పక్కన పెడితే కష్ట కాలంలో ఇబ్బందులు ఎదురు కావని బ్రహ్మానందం అన్నారు. రాజనాల, సావిత్రి, కాంతారావులాంటి మహానటులు కోట్ల రూపాయలు సంపాదించి చివరకు ఏమీ లేని స్థితిలో చనిపోయారని బ్రహ్మానందం కామెంట్లు చేశారు. ఆ రీజన్ వల్లే డబ్బుకు విలువ ఇస్తానని డబ్బును నువ్వు ప్రేమిస్తే డబ్బు కూడా నిన్ను ప్రేమిస్తుందని బ్రహ్మానందం చెప్పుకొచ్చారు.
Most Recommended Video
టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?