“కామెడీ” కధ క్లైమ్యాక్స్ కు చేరినట్లు ఉంది?
- February 10, 2016 / 09:21 AM ISTByFilmy Focus
టాలీవుడ్ లో ఎంత పెద్ద స్టార్ అయినా, ఎలాంటి అప్సరస అయిన, ఇంకా చెప్పాలంటే బడా హీరోలయినా ఏదో ఒక రోజు రిటైర్ కావాల్సిందే. అయితే రిటేర్మెంట్ అనేది గౌరవంగా, మనకు మనం మన భద్యతల నుంచి పక్కకు తప్పుకుంటే పర్వాలేదు కానీ బలవంతంగా, ఇక మనని భరించలేక పక్కకు పొమ్మంటేనే అప్పటివరకూ సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతలకు ఇబ్బందులు కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. అసలు ఇంత స్టోరీ దేనికంటే….
నిన్న మన కామెడీ అణు బాంబ్ బ్రహ్మీ 59 పుట్టిన రోజు జరుపుకున్న సంధర్భంలో మీడియాతో మాట్లాడుతూ తనపై చాలా రూమర్స్ వస్తున్నాయి అని, తన పని అయిపోయింది అంటూ చాలా మాటలు వినిపిస్తున్నాయి అని, దానికి కారణం గత ఏడాది తాను నటించిన సినిమాలు పెద్దగా హిట్ కాకపోవడం, తాను లేకుండా చిన్న సినిమాలు ఎన్నో బ్లాక్ బస్టర్స్ కావడం వల్లనే అని చెబుతూ, తాను ఇప్పటికి దాదాపుగా 1055 చిత్రాల్లో నటించానని, ఎంతో మంది బడా హీరోలతో పని చేశానని, రానున్న రోజుల్లో మహేష్ బాబుతో ‘బ్రహ్మోత్సవం’లో పవన్ కళ్యాణ్ తో ‘సర్దార్ గబ్బర్ సింగ్’లో వెంకటేష్ తో ‘బాబు బంగారం’లో నటిస్తున్నానని, ఏ వయసులో ఇంతకన్నా ఏం కావాలి అంటూ తన కరియర్పై వస్తున్న రూమర్స్ కు చెక్ పెట్టాడు.అంతేకాకుండా గత ఏడాది తాను నటించిన సినిమాకు ఫ్లాప్ కావడంలో నా పాత్ర ఏమీ ఉండదు అని, కాకపోతే ఇప్పటివరకూ మొహమాటానికి, కాదనలేక, నో చెప్పలేక కొన్ని పాత్రలు చేశాను, కానీ ఇప్పటి నుంచి ఆచి తూచి ఆలోచించి, కధ వినీ మరీ పాత్ర ఒప్పుకుంటాను అని తెలిపాడు. చివరిగా తనకు ప్రత్యేక పాత్రలు, వేరే పాత్రలపై పెద్దగా ఆసక్తి లేదని, కేవలం కమీడియన్ గానే హ్యాపీ అంటూ తెలిపాడు.
ఏది ఏమైనా..ఇప్పుడున్న సినీ ప్రపంచంలో “జబర్దస్త్” లాంటి కమీడియన్స్ ఉండగా భారీ డబ్బు పెట్టి మరీ బ్రహ్మీనీ తీసుకోవడం అంటే నిర్మాతలకు కట్టి మీద సామే అన్నది ఒప్పుకోక తప్పని నిజం. చూద్దాం మరి ఏం జరుగుతుందో.
Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus












