ఏప్రిల్ 10న బ్రహ్మోత్సవం ఆడియో వేడుక!

సూపర్ స్టార్ మహేష్ బాబు, కాజల్, సమంత, ప్రణీత హీరోహీరోయిన్లుగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న “బ్రహ్మోత్సవం” చిత్రం ప్రస్తుతం వారణాసిలో చిత్రీకరణ జరుపుకొంటున్న విషయం తెలిసిందే. పివిపి సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జె.మేయర్ సంగీత సారధ్యం వహిస్తున్నాడు.

ఈ చిత్రం ఆడియోను ఏప్రిల్ 10న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మహేష్ బాబు కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఆడియోను తిరుమల తిరుపతిలో విడుదల చేసేందుకు ప్రణాళికలు వేసుకొంటున్నారు. అదే స్థాయిలో నిర్వహించేందుకు చిత్ర బృందం సమాయత్తమవుతోంది.

ఏప్రిల్ 29న ఈ చిత్రం విడుదల కానున్న విషయం తెలిసిందే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus