విజయ్ సేతుపతి (Vijay Sethupathi) తమిళంలో పెద్ద స్టార్. హీరోగానే కాకుండా విలక్షణమైన పాత్రలు చేస్తూ తిరుగులేని క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఒక్క తమిళంలోనే కాకుండా హిందీలో కూడా పలు క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తున్నాడు. అక్కడ కూడా విజయ్ సేతుపతికి మంచి క్రేజ్ ఏర్పడింది. అయితే హిందీలో కంటే ముందుగా అతను తెలుగులో ఎంట్రీ ఇచ్చాడు. పిజ్జా సినిమాతో విజయ్ సేతుపతి తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా హిట్ అయ్యింది.
కానీ ఆ తర్వాత ఇతను తెలుగు మార్కెట్ పై ఫోకస్ చేయలేదు. చాలా గ్యాప్ తర్వాత తెలుగులో సైరా, ఉప్పెన చేశాడు. ఆ తరువాత ఇతను తమిళంలో చేసిన సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాయి కానీ వాటికి సరైన ప్రమోషన్ చేయకపోవడం వల్ల అవి ఆడలేదు. మొత్తానికి చాలా గ్యాప్ తర్వాత హీరోగా మహారాజ అనే సినిమా చేశాడు విజయ్ సేతుపతి. దీనికి ఒక స్పెషాలిటీ కూడా ఉంది. ఎందుకంటే..
ఇది విజయ్ సేతుపతి కెరీర్లో తెరకెక్కిన 50 వ సినిమా. అందుకే అనుకుంట దీనిని తెలుగులో కూడా బాగా ప్రమోట్ చేశాడు. జూన్ 14న రిలీజ్ అయిన ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో మొదటి వీకెండ్ కే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించింది. తమిళంలో కూడా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించినట్టే. ఇక నుండి విజయ్ సేతుపతి హీరోగా ఎక్కువ సినిమాలు చేస్తాడేమో చూడాలి