Bigg Boss 5 Telugu: దూరం నుండి చూసి దూరమైన ఫ్రెండ్స్‌

బిగ్‌బాస్‌ ఇంట్లో ప్రచారం కోసం మోజ్‌ రూమ్‌ను క్రియేట్‌ చేశారు. అంటే ఇదేదో స్పెషల్‌ రూమ్‌ అని కాదు. పిచ్చాపాటిగా మాట్లాడుకునే ఓ చిన్న గదికి ఆ పేరు పెట్టారు. దీనికి బిగ్‌బాస్‌ హౌస్‌మేట్లు… అందరూ వాడుకోవచ్చు. అయితే దానికి బాగా వాడుకునే ముగ్గురు గురించి మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. షో ఫాలో అవుతున్న ఎవరైనా ఈ విషయం చెప్పేయొచ్చు. వాళ్లే జశ్వంత్‌, సిరి, షణ్ముఖ్‌. అయితే ఇప్పుడు ఈ త్రిమూర్తులు కాస్త ఇద్దరైపోతున్నారా?

మంగళవారం ఎపిసోడ్‌ చూసినవారికి ఈ విషయం పక్కాగా తెలిసిపోతుంది. ఎందుకంటే ఆ రోజు ఎపిసోడ్‌లో ఈ ముగ్గురూ ఒక దగ్గర కనిపించిన ఫ్రేమ్‌లు ఒక్కటీ లేవని చెప్పొచ్చు. షన్ను, జెస్సీ ఒక దగ్గర కూర్చుని కనిపిస్తే, సిరి వేరేగా తన పని తాను చేసుకుంటోంది. షన్ను మాటలు సిరి నచ్చకపోవడం, సిరి చేష్టలు షన్నుకు నచ్చకపోవడం కారణం. అయితే దీనికి ఆజ్యం పోసేలా… బెడ్‌ చెకింగ్‌ సెగ్మంట్‌ జరిగింది. మిసెస్‌ ప్రభావతి గుడ్ల టాస్క్‌ జరుగుతున్నప్పుడు…

సిరి బెడ్‌ రూమ్‌కి వచ్చి ఓ బెడ్‌ వెతికింది. అది తన బెడ్‌ అనుకుని షన్ను… ‘చూడు మన బెడ్‌ చూస్తోంది… ఇది ఇంతే’ అనేశాడు. ఆ మాటలు సిరి చెవిన పడ్డాయి. వేరే బెడ్‌ చూస్తుంటే… అలా ఎలా అంటాడు అంటూ సిరి అలిగింది. జెస్సీ వచ్చి సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు. కానీ వర్కౌట్‌ అవ్వలేదు. దీంతో త్రిమూర్తులకు బీటలు వారినట్లున్నాయి. అయితే త్వరగా ప్యాచప్‌ అవ్వడం సిరికి అలవాటే. చూద్దాం ఏం చేస్తుందో.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహా సముద్రం సినిమా రివ్యూ & రేటింగ్!
ఒక్కో సినిమాకు ఈ స్టార్ హీరోలు ఎంతెంత డిమాండ్ చేస్తున్నారో తెలుసా?
టాలీవుడ్ లో బి.టెక్ చదువుకున్న 10 మంది లిస్ట్..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus