‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా షూటింగ్ పనులు అయిపోయాయి.. పోస్ట్‌ప్రొడక్షన్‌ని ఫుల్ స్వింగ్‌లో చేసి ఓ లెవల్‌లోకి వచ్చాక రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారు అని సమాచారం. ఈ విషయంలో క్లారిటీ వచ్చేయడంతో నెక్స్ట్‌ఏంటి అనే ప్రశ్న వినిపిస్తూనే ఉంది. పవన్ కల్యాణ్ అయితే కండిషన్స్‌తో సినిమా షూటింగ్‌లకు ఓకే చెప్పారు. ఈ క్రమంలో ఆయన మిత్రుడు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ మరోసారి రంగంలోకి దిగారు. ఇక్కడి వరకు పాత వార్తే. అయితే ఇప్పుడు ఆయన ఎంటర్ అయింది ఓ సీక్వెల్ కోసమని తెలుస్తోంది.
గతంలో ఇలానే తివిక్రమ్ ముందుకొచ్చి ఓ సినిమాను ఓకే చేశారు మీకు గుర్తుండే ఉంటుంది. ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ సినిమాను పక్కన పెట్టి మరీ అప్పుడు పవన్ ఆ సినిమా చేశారు. యస్.. మీకు గుర్తొచ్చిందే.. ‘బ్రో’. ఆ సినిమా అప్పుడు సరైన ఫలితం అయితే ఇవ్వలేదు. చాలా తక్కువ కాల్‌షీట్స్‌తో పవన్‌తో ఆ సినిమా చేశారు ప్రముఖ దర్శకుడు సముద్రఖని. ఇప్పుడు ఆయన ఆ సినిమాకు రెండో పార్టు కోసం కథ సిద్ధం చేశారట. దానికి రచనా సహకారంలో త్రివిక్రమ్ అందిస్తారని టాక్ వచ్చింది.
సముద్రఖని ఇటీవల ఓ సినిమా ప్రచారంలో పాల్గొనగా.. అక్కడ ‘బ్రో’ సినిమా సీక్వెల్ ప్రస్తావన వచ్చింది. ‘బ్రో’ సినిమా కంటిన్యుయేషన్ ఎప్పుడు ఉంటుందని అడగ్గా.. స్క్రిప్ట్ సిద్ధంగా ఉందని, పవన్ నుండి అంగీకారం వస్తే మొదలుపెట్టడమే అని చెప్పారు. అంటే త్రివిక్రమ్ ఇన్నాళ్లుగా ప్రయత్నం చేస్తోంది ‘బ్రో’ సినిమా సీక్వెల్ కోసమే అనే విషయం అర్థమైంది. అయితే ఆ సినిమాకు సరైన ఫలితం రాలేదు. బాగుంది అనే టాక్ వచ్చినా రీమేక్ అనే మార్క్ వేసి సినిమా హైప్ జనాల్లోకి వెళ్లకుండా ఆగిపోయింది.
మరిప్పుడు సముద్రఖని స్ట్రెయిట్ కథతో ఈ సీక్వెల్ తీయబోతున్నారు. ఇప్పుడు ఎలాంటి కథతో వస్తారు, ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి. అదేంటి ‘అన్నీ అనుకున్నట్లుగా జరిగి.. సినిమా మొదలైతే’ అనే మాట వాడాలి కదా అనుకుంటున్నారా? త్రివిక్రమ్ ప్లానింగ్ చేశాక ఆ సినిమా స్టార్ట్ కాకుండా ఉంటుందా చెప్పండి.