పవన్ కళ్యాణ్ – సాయి తేజ్ కాంబినేషన్లో ‘బ్రో’ అనే సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. సముద్రఖని డైరెక్ట్ చేసిన ఈ చిత్రానికి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు. ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ బ్యానర్ పై టి.జి.విశ్వప్రసాద్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించగా వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరించారు.కేతిక శర్మ హీరోయిన్ గా నటించింది.టీజర్, ట్రైలర్లు బాగున్నప్పటికీ పాటలు సో సో గానే ఉన్నాయి. జూలై 28 న ఈ సినిమా రిలీజ్ అయ్యింది.
మొదటి షో తోనే మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ ..మొదటి రోజు ఓపెనింగ్స్ మాత్రం అదిరిపోయాయి అని చెప్పాలి.రెండో రోజు కూడా బాగానే కలెక్ట్ చేసింది. ఒకసారి 2 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :
నైజాం
13.05 cr
సీడెడ్
3.96 cr
ఉత్తరాంధ్ర
4.01 cr
ఈస్ట్
3.13 cr
వెస్ట్
3.35 cr
గుంటూరు
3.20 cr
కృష్ణా
1.96 cr
నెల్లూరు
1.00 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
33.66 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
3.11 cr
ఓవర్సీస్
5.02 cr
వరల్డ్ వైడ్ (టోటల్)
41.79 cr (షేర్)
‘బ్రో’ (Bro) చిత్రానికి రూ.97.98 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.98.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటిరోజు ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. అయినా మొదటి రోజు భారీ కలెక్షన్స్ వచ్చాయి. రెండు రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమా రూ.41.79 కోట్లు షేర్ ను కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కి మరో రూ.56.71 కోట్ల షేర్ ని రాబట్టాలి.