జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీమేక్ సినిమాలతో సైతం రికార్డులు క్రియేట్ చేయగలరు. పవన్ కళ్యాణ్ మార్కెట్ గత కొన్నేళ్లలో భారీ స్థాయిలో పెరిగిందనే సంగతి తెలిసిందే. బ్రో సినిమాకు రికార్డు స్థాయిలో బిజినెస్ జరగగా ఓవర్సీస్ లో బ్రో మూవీ వాల్తేరు వీరయ్య ప్రీమియర్స్ ద్వారా క్రియేట్ చేసిన రికార్డును బ్రేక్ చేసింది. అయితే వీరసింహారెడ్డి ప్రీమియర్స్ రికార్డ్ మాత్రం బ్రేక్ కాలేదు. పలు పాన్ ఇండియా సినిమాలను మించి బ్రో మూవీ కలెక్షన్లు సాధించడం ఫ్యాన్స్ సంతోషానికి కారణమవుతోంది.
బ్రో సినిమాకు ప్రీమియర్స్ ద్వారా 647k డాలర్స్ కలెక్షన్లు వచ్చాయి. వాల్తేరు వీరయ్య మూవీ ప్రీమియర్ కలెక్షన్లు 638k డాలర్స్ కాగా వీరసింహారెడ్డి సినిమాకు ప్రీమియర్స్ ద్వారా 708k డాలర్స్ కలెక్షన్లు వచ్చాయి. లైగర్, దసరా ప్రీమియర్స్ కలెక్షన్లను బ్రో మూవీ సులువుగానే బ్రేక్ చేసింది. బాక్సాఫీస్ వద్ద పవన్ కళ్యాణ్ సంచలనాలను సృష్టిస్తుండగా ఫస్ట్ వీకెండ్ లోనే ఈ సినిమా 60 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం కలెక్షన్లను సొంతం చేసుకుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
బ్రో సినిమా (Bro Movie) పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు తెగ నచ్చేసింది. పవన్ ఓల్డ్ సాంగ్స్ ను సినిమాలో సందర్భానికి అనుగుణంగా ప్రస్తావించడం కూడా ఫ్యాన్స్ కు ఎంతగానో నచ్చిందని తెలుస్తోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హ్యాట్రిక్ విజయాలను సాధించడంతో పవన్ ఫ్యాన్స్ తెగ సంతోషిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ కొత్త సినిమాలకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారని త్వరలో ఆ ప్రాజెక్ట్ లకు సంబంధించిన ప్రకటనలు వెలువడనున్నాయని తెలుస్తోంది. భోళా శంకర్ విడుదలయ్యే వరకు బ్రో సినిమాకు భారీ రేంజ్ లో కలెక్షన్లు రావడం ఖాయమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బ్రో సినిమా సరికొత్త రికార్డులు క్రియేట్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.