BRO Movie: ‘బ్రో’ మూవీ నుండీ మొదటి పాట వచ్చేసింది ఎలా ఉందంటే?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్లో ‘బ్రో’ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ‘వినోదయ సీతమ్’ కి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని… అదే డైరెక్టర్ సముద్రఖని డైరెక్ట్ చేశాడు.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లేని అందించారు. జూలై 28 న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. అంటే రిలీజ్ కి మరో 20 రోజులు మాత్రమే టైం ఉంది. అందుకే ప్రమోషన్స్ ను ఫుల్ స్వింగ్ లో ప్రారంభించారు.

ఆల్రెడీ (BRO Movie) టీజర్ ను రిలీజ్ చేశారు. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. కాన్సెప్ట్ సాంగ్ ను కూడా విడుదల చేయడం జరిగింది. దానికి కూడా పాజిటివ్ టాక్ వినిపించింది. ఇప్పుడు ‘మై డియర్ మార్కండేయ’ అంటూ మరో స్పెషల్ సాంగ్ ను విడుదల చేశారు. సినిమా మధ్యలో వచ్చే స్పెషల్ సాంగ్ ఇదని తెలుస్తుంది. ‘ఇంట్రో ఆపు దుమ్ము లేపు’ అంటూ ఈ సాంగ్ మొదలైంది. సంగీత దర్శకుడు తమన్ అందించిన ట్యూన్ బాగానే ఉంది కానీ వెంటనే ఎక్కేలా అయితే లేదు.

‘మై డియర్ మార్కండేయ మంచి మాట చెప్తా రాసుకో .. మళ్ళీ పుట్టి భూమ్మీదికి రానే రావు నిజం తెలుసుకో ‘ అనే లిరిక్స్ వచ్చినప్పుడు పవన్ ఎంట్రీ ఇవ్వడం జరిగింది. అభిమానులని అట్రాక్ట్ చేసేలా పవన్ ఎంట్రీ ఉంది.  ఆ తర్వాత ఊర్వశి రౌతేలా ఎంట్రీ ఇచ్చి చిందులు వేయడం స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది అని చెప్పాలి. రామజోగయ్య శాస్త్రి అందించిన లిరిక్స్ బాగున్నాయి. రేవంత్, స్నిగ్ద శర్మ బాగానే పాడారు. ఈ లిరికల్ సాంగ్ ని మీరు కూడా ఓసారి చూస్తూ వినెయ్యండి

రంగబలి సినిమా రివ్యూ & రేటింగ్!

రుద్రంగి సినిమా రివ్యూ & రేటింగ్!
18 స్టార్ హీరోయిన్ల చిన్ననాటి రేర్‌ ఫోటోలు వైరల్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus