60 లక్షల మంది లైవ్‌లో ఉండగా నిద్రపోయిన స్టార్‌!

నిద్రపోయి కూడా వైరల్‌ అవ్వొచ్చా? ఈ వార్త చదివాక, దానికి సంబంధించిన వీడియో చూశాక ‘కచ్చితంగా అవ్వొచ్చు’ అనే సమాధానమే వస్తుంది. అదేంటి అంతలా ఎవరు నిద్రపోయారు, వైరల్‌ అయ్యారు అనుకుంటున్నారు. వైరల్‌ అయ్యారు.. అందులోనూ ఆ వ్యక్తి సాధారణమైన పర్సన్‌ కూడా కాదు.. స్టార్‌. అయితే ఇక్కడి వ్యక్తి మాత్రం కాదు. ఇదంతా దక్షిణ కొరియాకు చెందిన పాపులర్‌ మ్యూజిక్‌ బ్యాండ్‌ బ్యాంగ్‌టన్‌ బాయ్స్‌ కి చెందిన వ్యక్తి గురించే.

బ్యాంగ్‌టన్‌ బాయ్స్‌ అంటే అంత ఈజీగా గుర్తుకురాపోవచ్చు కానీ.. BTS అంటే ఠక్కున గుర్తొస్తుంది. ప్రపంచవ్యాప్తంగా పేరుపొందిన ఈ బ్యాండ్‌కు చెందిన ఏడుగురు సభ్యులు తరచూ అభిమానులతో లైవ్‌ చాట్‌ నిర్వహిస్తుంటారు. అలా ఇటీవల నిర్వహించిన లైవ్‌లో ఓ బీటీఎస్‌ సభ్యుడు నిద్రపోయాడు. దీంతో ఆ వీడియో వైరల్‌గా మారిపోయింది. ఆ సమయంలో ఎవరూ చూడటం లేదా అంటే 60లక్షలమందికిపైగా లైవ్‌లో ఉన్నారు. BTS బ్యాండ్‌లో ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్‌ ఉన్న జంగ్‌కుక్ ఆ పని చేశాడు.

ఆదివారం ఉదయం నిర్వహించిన లైవ్‌ సెషన్‌లో జంగ్‌కుక్‌ మాట్లాడుతూ మాట్లాడుతూ నిద్రలోకి వెళ్లిపోయాడు. ఆ సమయంలో సుమారు 60లక్షల మంది లైవ్‌లో ఉన్నారట. దాదాపు 21 నిమిషాలపాటు లైవ్‌ అలానే కొనసాగించారు. అంతసేపులో జంగ్‌కుక్‌కు మెలకువ రాలేదట. దీంతో మిగతా ఆరుగురే మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు ట్విటర్‌లో వైరల్‌ అయ్యాయి. అంతేకాదు #JUNGKOOK అనే హ్యాష్‌ట్యాగ్‌తో ట్విటర్‌లో 8 లక్షలకుపైగా ట్వీట్స్‌ వచ్చాయట.

దీంతో అలా నిద్రలోకి ఎలా వెళ్లిపోయావా జంగ్‌కుక్‌ సామి అంటూ ఫ్యాన్స్‌ నవ్వుకుంటున్నారు. ఇక BTS బ్యాండ్‌ గురించి చెప్పాలంటే జిన్‌, జంగ్‌కుక్‌, సుగా, జె హోప్‌, ఆర్‌ఎమ్‌, జిమిన్‌, వి అనే వాళ్లు సభ్యులు. వీరి నుండి ఇప్పటివరకు పాపులర్‌ సాంగ్స్‌ చాలా వచ్చాయి. ‘బటర్‌..’, ‘ఫేక్‌ లవ్‌..’, ‘ఐడల్‌..’, ‘డైనమైట్‌..’ వంటి మంచి విజయం అందుకున్నాయి. త్వరలో అదిరిపోయే మరో ఆల్బమ్‌ వస్తుందట.

టక్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!

అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్లేనా..!/a>
కలెక్షన్లలో దూసుకుపోతున్న లేడీ ఓరియంటల్ సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus