Maanasa Choudhary: మాసన బాలనటిగా ఎన్ని సినిమాల్లో నటించిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

బుల్లితెర మీద నెంబర్ 1 యాంకర్ గా మన చిన్నతనం నుండి ఇప్పటి వరకు కొనసాగుతున్న యాంకర్ ఎవరైనా ఉన్నారా అంటే అది సుమ అనే చెప్పాలి. ఏ ప్రీ రిలీజ్ ఈవెంట్ చూసిన ఈమెనే కనిపిస్తాది,ఏ ఇంటర్వ్యూ చూసినా ఈమెనే ఉంటుంది, ఇలా రెండు దశాబ్దాల నుండి ఆమె ఈ యాంకరింగ్ రంగం లో డామినేట్ చేస్తూనే ఉంది. ఇప్పుడు ఆమె కొడుకు రోషన్ కూడా అదే రేంజ్ లో టాలీవుడ్ లో తన డామినేషన్ చూపించడానికి సిద్ధం అయ్యాడు.

ఆయన హీరో గా నటించిన ‘బబ్లీ గమ్’ అనే చిత్రానికి సంబంధించిన టీజర్ ని రీసెంట్ గానే విడుదల చేశారు. న్యాచురల్ స్టార్ నాని ని ముఖ్య అతిథిగా పిలిచి హైదరాబాద్ లో గ్రాండ్ గా ఈ టీజర్ లాంచ్ ఈవెంట్ ని జరిపారు. అలా లాంచ్ అయిన ఈ టీజర్ కి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. హీరో రోషన్ తో పాటుగా హీరోయిన్ మానస చౌదరి కూడా ఈ టీజర్ లో బాగా ఫోకస్ అయ్యింది.

వీళ్లిద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా చక్కగా కుదిరినట్టు ఈ టీజర్ ని చూస్తేనే అర్థం అవుతుంది. నిమిషం నిడివి ఉన్న టీజర్ కట్ లోనే వీళ్ళ మధ్య ఈ రేంజ్ రొమాన్స్ చూపించారు. ఇక సినిమా లో ఇలాంటి సన్నివేశాలు ఎన్ని ఉన్నాయో అని ఆడియన్స్ లో ఆత్రుత పెరిగింది. ఇకపోతే ఈ హీరోయిన్ ని చూడగానే ఆమె ఎవరు, ఇంతకు ముందు ఏమైనా సినిమాల్లో నటించిందా?, ఏ ప్రాంతానికి చెందిన అమ్మాయి? అనేది గూగుల్ లో వెతకడం ప్రారంభించారు.

అలా వెతకగా ఈమె తమిళం లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో బాలనటిగా నటించింది అని తెలిసింది. విజయ్, విక్రమ్ , కమల్ హాసన్, సూర్య సినిమాల్లో ఈమె బాల నటిగా నటించింది. ఇప్పుడు అకస్మాత్తుగా ఇలా హాట్ అందాలను ఆరబోస్తూ హీరోయిన్ గా (Maanasa Choudhary) మారి అందరినీ షాక్ కి గురి చేసింది.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus