Bubblegum Collections: ‘బబుల్ గమ్’ మొదటి రోజు కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే?

సుమ కొడుకు రోషన్ కనకాల హీరోగా ఎంట్రీ ఇస్తూ ‘బబుల్ గమ్’ అనే సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. ‘క్షణం’ ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ వంటి వైవిధ్యమైన సినిమాలతో దర్శకుడిగా మంచి పేరు సంపాదించుకున్న రవికాంత్ పేరేపు ఈ చిత్రానికి దర్శకుడు. మానస చౌదరి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థతో కలిసి ‘మహేశ్వరి మూవీస్’ సంస్థ నిర్మించింది. టీజర్, ట్రైలర్స్, పాటలు వంటివి బాగానే అనిపించాయి.

దీంతో డిసెంబర్ 29 న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా పై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. అయితే మొదటి రోజు ఈ సినిమా ఆశించిన స్థాయిలో కలెక్ట్ చేయలేదు. ఒకసారి ఫస్ట్ డే కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 0.06 cr
సీడెడ్ 0.03 cr
ఆంధ్ర(టోటల్) 0.05 cr
ఏపీ + తెలంగాణ 0.14 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా+ ఓవర్సీస్ 0.03 cr
వరల్డ్ వైడ్ టోటల్ 0.17 cr

‘బబుల్ గమ్’ (Bubblegum) చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.4.75 కోట్ల షేర్ ను రాబట్టాలి.మొదటి రోజు ఈ సినిమా కేవలం రూ.0.17 కోట్లు షేర్ ను మాత్రమే రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి ఇంకో రూ.4.58 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఒకపక్క పోటీగా ‘డెవిల్’ సినిమా ఉంది. మరోపక్క ‘సలార్’ రెండో వీకెండ్లో కూడా స్ట్రాంగ్ గా నిలబడుతుంది. వాటి ముందు ‘బబుల్ గమ్’ నిలబడలేకపోతుంది అని స్పష్టమవుతుంది.

డెవిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

బబుల్ గమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘ఖైదీ నెంబర్ 786’ టు ‘ఠాగూర్’.. తెలుగులో రీమేక్ అయిన విజయ్ కాంత్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus