Buchi Babu: ‘పుష్ప2’ సినిమాపై క్లారిటీ ఇచ్చిన బుచ్చిబాబు!

రీసెంట్ గా దర్శకుడు సుకుమార్, బుచ్చిబాబు కలిసి స్క్రిప్ట్ డిస్కషన్స్ చేస్తున్నట్లుగా సోషల్ మీడియాలో ఓ ఫొటో ప్రత్యక్షమైంది. ఈ ఫొటో చూసినవారంతా.. ‘పుష్ప2’ స్క్రిప్ట్ విషయంలో బుచ్చిబాబు సానా సాయం చేస్తున్నారని కథనాలను ప్రచురించారు. తాజాగా ఈ విషయంపై బుచ్చిబాబు క్లారిటీ ఇచ్చారు. దీనికి సంబంధించిన తన సోషల్ మీడియా అకౌంట్ లో ఓ పోస్ట్ పెట్టారు బుచ్చిబాబు. ”ఈ ఫొటో నేను తరువాత చేయబోయే నాసినిమా కథ డిస్కషన్ సందర్భంలోది.

మా గురువు గారు సుకుమార్ సార్ నా కోసం నా సినిమా కథ కోసం హెల్ప్ చేయడానికి వచ్చారు. సుకుమార్ సార్ సినిమా కథలో కూర్చుని డిస్కషన్ చేసేంత స్థాయి నాకు లేదు.. రాదు. ఆయన నుంచి నేర్చుకోవడం తీసుకోవడమే తప్ప, ఆయనకి ఇచ్చేంత లేదు” అంటూ ట్విట్టర్ లో క్లారిటీ ఇచ్చారు. చాలా కాలంగా బుచ్చిబాబు.. ఎన్టీఆర్ తో ఓ సినిమా చేయాలనుకుంటున్నారు. దీనిపై ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు.

‘పెద్ది’ అనే టైటిల్ తో మాస్ అండ్ కమర్షియల్ సినిమాగా దీన్ని తెరకెక్కించాలనుకున్నారు. ఇంకా స్క్రిప్ట్ లాక్ అవ్వలేదు. ఇప్పటికే బుచ్చిబాబు.. ఎన్టీఆర్ కి రెండు, మూడు నెరేషన్స్ ఇచ్చారు. కానీ ఎన్టీఆర్ కి కొన్ని సందేహాలు ఉన్నాయి. దీంతో బుచ్చిబాబు తన టీమ్ తో కలిసి స్క్రిప్ట్ పై వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు సుకుమార్ ని రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా చేయబోతున్నారు.

ఆ సినిమా పూర్తయ్యే లోపు బుచ్చిబాబు స్క్రిప్ట్ రెడీ చేయాల్సి ఉంటుంది. తనకు స్క్రిప్ట్ విషయంలో సాయం చేయమని గురువు సుకుమార్ ని కోరాడట బుచ్చిబాబు. దీంతో సుకుమార్ కాదనలేకపోయారు. సుకుమార్ రంగంలోకి దిగారు కాబట్టి ఎన్టీఆర్ స్క్రిప్ట్ లాక్ అయినట్లేనని చెబుతున్నారు.

థాంక్యూ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus