ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు పేరు ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. 2021లో ఇప్పటివరకు విడుదలైన సినిమాల్లో బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ గ్రాస్ కలెక్షన్స్ అందుకున్న సినిమాగా ఉప్పెన నిలిచింది. దీంతో దర్శకుడికి బాగా డిమాండ్ ఏర్పడింది. అయితే అతన్ని బయటకు వెళ్ళనివ్వకుండా మరో రెండు సినిమాలకు మైత్రి మూవీ మేకర్స్ లాక్ చేసేసుకుంది. ఇక జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేసే ఛాన్స్ ఉన్నట్లు మొదటి నుంచి రూమర్స్ అయితే వస్తున్నాయి.
ఇక ఆ సినిమా వైజాగ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే స్పోర్ట్స్ డ్రామా అని తెలుస్తోంది. ఇప్పటికే నిర్మాతలకు కథను వినిపించినట్లు టాక్. అయితే ఎన్టీఆర్ కు బుచ్చిబాబుకు ముందు నుంచే పరిచయం ఉంది. నాన్నకు ప్రేమతో సినిమాకు బుచ్చిబాబు అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసిన విషయం తెలిసిందే. ఇక దర్శకుడు ప్రతిభ గురించి ముందు నుంచే తెలుసు కాబట్టి ఎన్టీఆర్ తప్పకుండా సినిమా చేయవచ్చని సమాచారం. ప్రస్తుతం ఎన్టీఆర్ RRR సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
ఆ సినిమా తరువాత KGF డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో ఒక సినిమా చేయనున్నాడు. ఆ రెండు సినిమాల తరువాత బుచ్చిబాబుతో సినిమా చేయవచ్చని టాక్. ఇక ఉప్పెన దర్శకుడికి అక్కినేని ఫ్యామిలీ నుంచి కూడా ఆఫర్స్ వస్తున్నాయట. అతను అఖిల్ తో కూడా సినిమా చేయవచ్చని టాక్ వస్తోంది.
Most Recommended Video
పిట్ట కథలు సిరీస్ రివ్యూ & రేటింగ్!
నాంది సినిమా రివ్యూ & రేటింగ్!
పొగరు సినిమా రివ్యూ & రేటింగ్!