తొలి సినిమాతో విజయం సాధించడమే పెద్ద విషయం అనుకుంటే… వంద కోట్ల రూపాయాల వసూళ్లు అందుకోవడం ఇంకా పెద్ద విషయం. ప్రవేట్ సంస్థలు అవార్డులు రావడం ఇంకా ఇంకా పెద్ద విషయం. అలాంటిది ఆ సినిమాకు ఏకంగా జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రం వస్తే… ఆ ఆనందాన్ని అవధులే ఉండవు. ఇప్పుడు అలాంటి అవధులు లేని ఆనందాన్ని అనుభవిస్తున్న దర్శకుడు బుచ్చిబాబు సానా. ఈ నేపథ్యంలో బుచ్చిబాబు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
జీవితంలో రిస్క్ చేస్తే ఏదోకటి వస్తుందంటారు. నాకు తెలిసి జీవితంలో నేను చేసిన రిస్క్ ‘ఉప్పెన’. ఇప్పుడు అదే నాకు జాతీయ స్థాయిలో పురస్కారాన్ని అందించింది. ఈ సినిమా క్లైమాక్స్ గురించి ఎవరి దగ్గరైనా ప్రస్తావించినప్పుడు ‘ఇలా తీస్తే చూస్తారా?’ అని అడిగేవారట ఆయన్ను. ఈ విషయాన్ని చాలా ప్రెస్ మీట్లలో చెప్పారు బుచ్చిబాబు. అలా డౌట్‌ఫుల్‌గా అనిపించిన సినిమానే ఇప్పుడు ఉత్తమ చిత్రం (తెలుగు)గా నిలిచింది. దీంతో కథ మీద, తెలుగు ప్రేక్షకుల మీద ఉన్న నమ్మకం గెలిపించింది అంటారాయన.
మరి అవార్డు వస్తుందని ముందే అనుకున్నారా? అలా అనుకుని సినిమా విషయం ముందుకెళ్లారా? లాంటి ప్రశ్నలు ఇప్పుడు ఆయన చుట్టూ చేరుతాయి. అందుకే దానికి కూడా ఆయన సమాధానం చెప్పారు. అవార్డుల్ని దృష్టిలో పెట్టుకొని ఈ సినిమా చేయలేదు. కానీ ఈ కథ చెప్పిన వెంటనే చిరంజీవి అవార్డుల గురించి చెప్పేశారు. ‘‘బుచ్చిబాబూ ఈ సినిమా నీకు చాలా అవార్డులు తెచ్చి పెడుతుంది. అంతేకాదు జాతీయ అవార్డు కూడా వస్తుంది’’ అని కూడా చెప్పారు అని బుచ్చిబాబు.
అంతేకాదు బుచ్చిబాబు (Buchi Babu) గురువు సుకుమార్ కూడా కథ విన్నప్పుడు ఇదే మాట అన్నారట. వారి మాటలు ఇప్పుడు నూటికి నూరు శాతం నిజమయ్యాయి అని బుచ్చిబాబు గుర్తు చేసుకున్నారు. రామ్ చరణ్‌తో చేయబోయే సినిమా రా అండ్ రస్టిక్‌గా ఉంటుందని బుచ్చిబాబు చెప్పారు. స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయని, ఏడాది ఆఖరులో సినిమా షూటింగ్ మొదలవుతుంది అని చెప్పారు. అవార్డు వచ్చింది కాబట్టి… ఇంకాస్త ఒళ్లు మరింత దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా చేయాలి అని అన్నారు బుచ్చిబాబు.
2023 టాప్- 10 గ్రాసర్స్.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే?
‘భోళా శంకర్’ తో పాటు కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 10 సినిమాల రిజల్ట్స్.!
‘వాల్తేరు..’ టు ‘జైలర్’.. ఈ ఏడాది ఫస్ట్ వీక్ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్