విజయ్ కోసం భారీగా ఖర్చుపెడుతున్న పూరి

టాలీవుడ్ ఇండస్ట్రీలో రౌడి స్టార్ గా తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న విజయ్ దేవరకొండ సినిమా సినిమాకు తన రేంజ్ ను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నట్లు చాలా క్లియర్ గా అర్ధమయ్యింది. హిట్టు పడితే నెక్స్ట్ సినిమా అంతకు మించి అనేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇక చివరగా వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాతో అనుకోకుండా డిజాస్టర్స్ ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ రౌడీ బాయ్ పూరి సినిమాతో మరో పవర్ఫుల్ యూ టర్న్ తీసుకోవాలని అనుకుంటున్నాడు.

సినిమాకి సంబంధించిన టైటిల్ ఫస్ట్ లుక్ తోనే మంచి హైప్ క్రియేట్ చేశారు. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న లైగర్ సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. అయితే పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు బడ్జెట్ ఎంత అవుతుందనేది అందరిలో హాట్ టాపిక్ గా మారింది. సినిమా బడ్జెట్ రూ.110కోట్లని ఒక టాక్ అయితే వస్తోంది. పూరి జగన్నాథ్ కెరీర్ లో ఇంతవరకు ఈ స్థాయిలో అయితే ఏ సినిమాకు ఖర్చు చేయలేదు.

దీంతో సినిమా ఎలా ఉంటుందనేది అందరిలో ఆసక్తిని కలిగిస్తోంది. పూరి జగన్నాథ్ తో పాటు సినిమాకు కరణ్ జోహార్ సహా నిర్మాతగా ఉన్న విషయం తెలిసిందే. మరి సినిమా అభిమానుల అంచనాలను ఎంతవరకు అందుకుంటుందో చూద్దాం.

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus