బుల్లితెర స్టార్ల రొమాన్స్.. వైరల్ అవుతున్న పిక్స్..!

బుల్లితెర ‘బాహుబలి’ గా చెప్పుకోదగ్గ కార్తీక దీపం సీరియల్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇందులోని ప్రతీ పాత్ర ప్రేక్షకాదరణ పొందిందే. మరీ ముఖ్యంగా డాక్టర్ బాబు, వంటలక్క పాత్రలు స్టార్ ఇమేజ్ ను సైతం సొంతం చేసుకున్నాయి. సినిమా స్టార్లతో సమానంగా వీరి క్రేజ్ ఉంటుంది అనడంలో సందేహం లేదు. ఐపీఎల్, బిగ్ బాస్ వంటివి ఎన్ని వచ్చినా ‘కార్తీక దీపం’ సీరియల్ టీఆర్పిని టచ్ చేసేవి కావు.

ఇదిలా ఉండగా… డాక్టర్ బాబు,వంటలక్క పాత్రలు ఎంత ఫేమస్ అయినప్పటికీ.. ఈ సీరియల్ ఇన్నేళ్ళుగా సాగడానికి కారణం మోనిత అనే పాత్ర వల్ల. డాక్టర్ బాబుని ఎలాగైనా సొంతం చేసుకోవాలని ఈమె చేసిన ఘోరాలు అన్నీ ఇన్నీ కాదు. అయితే ఇప్పుడు ఈమె డాక్టర్ బాబు తమ్ముడి ప్రేమలో పడినట్టు తెలుస్తుంది. ఏకంగా అతనితో రొమాన్స్ కూడా చేసేస్తుంది. అదేంటి సీరియల్ ఏమైనా కొత్త మలుపు తీసుకుంటుందా? అని కంగారు పడకండి.

మోనిత పాత్ర పోషిస్తున్న శోభా శెట్టి… డాక్టర్ బాబు తమ్ముడు ఆదిత్య పాత్ర పోషిస్తున్న యశ్వంత్ హీరోగా ఓ సినిమా రూపొందనుంది. ఆ సినిమా పేరు ‘బుజ్జి బంగారం’. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ ఇటీవల రిలీజ్ అయ్యింది. ఈ పోస్టర్ లో హీరో యశ్వంత్ పైకి శోభాశెట్టి ఎక్కి అతన్ని గట్టిగా కౌగలించుకుంది. అంతే ఈ పోస్టర్ కాస్త వైరల్ గా మారింది. ‘అన్నయ్య లవర్ తో తమ్ముడు రొమాన్స్’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus