మరో అదిరిపోయే పాట సిద్ధం చేస్తున్నారట

సోషల్‌ మీడియా గురించి చెడు ఎంత ఉందో, మంచీ అంతే ఉంది అంటుంటారు. తొలి విషయం చెప్పడానికి చాలా ఉదాహరణలే ఉంటాయి. మీరు కూడా అలాంటి చెడు ఉదాహరణలు చాలా చూసే ఉంటారు. ఇక రెండో రకం చాలా తక్కువగా జరుగుతుంటాయి. అలాంటి వాటిలో ఒకటి తాజాగా తెలంగాణ జిల్లాల్లో జరిగింది. ఓ ప్రైవేట్‌ ఆల్బమ్‌ పాటకు పెళ్లిలో సరదాగా డ్యాన్స్‌ చేసిన ఓ యువతి ఇప్పుడు ఏకంగా ప్రైవేట్‌ ఆల్బమ్‌లో నటింబోతోంది. ఇప్పటికే అర్థమైపోయుంటుంది ఎవరా యువతి, ఏంటా కథ అనేది.

‘బుల్లెట్‌ బండి…’ అంటూ గాయని మోహన భోగరాజు కొన్ని రోజుల క్రితం ఓ ప్రైవేట్‌ ఆల్బమ్‌ చేసిన విషయం తెలిసిందే. తొలినాళ్లలోనే పాటకు మంచి స్పందన వచ్చింది. అయితే ఇటీవల ఓ పెళ్లి బారాత్‌లో వధువు ఆ పాటకు డ్యాన్స్‌ వేసినప్పటి నుండి… ఇప్పుడు ఎక్కడ చూసినా అదే పాట వినిపిస్తోంది, సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఆ పెళ్లి కూతురి వీడియో నచ్చి ఆమెకు ఏకంగా ప్రైవేట్‌ ఆల్బమ్‌ ఛాన్స్‌ వచ్చిందంటే నమ్ముతారా? కానీ అదే జరిగింది.

ఆ వీడియోలో డ్యాన్స్‌ వేసింది… మంచిర్యాల జిల్లా జిన్నారానికి చెందిన అటవీ ఉద్యోగి కుమార్తె సాయి శ్రీయ. రామకృష్ణాపూర్‌కు చెందిన ఆకుల అశోక్‌తో ఆమెకు పెళ్లి జరిగింది. దానికి ముందు బారాత్‌లో సాయిశ్రీయ ఆ డ్యాన్స్‌ వేశారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్‌ అయ్యింది. ఈ ‘బుల్లెట్ బండి…’ పాటను నిర్మించిన బ్లూ రాబిట్ ఎంటర్ టైన్ మెంట్ త్వరలో మరో పాట రూపొందింబోతున్నారు. అది కూడా సాయిశ్రియతో. ఈ మేరకు బ్లూ రాబిట్‌ నిర్వాహకురాలు నిరూప… సాయి శ్రియకు ఫోన్‌ చేశారట.


చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus