‘గంగోత్రి’ ‘ఆర్య’ వంటి చిత్రాలతో సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న అల్లు అర్జున్ కు మాస్ ఇమేజ్ ను తెచ్చిపెట్టిన మూవీ ‘బన్నీ’. ‘సిరి వెంకటేశ్వర ప్రొడక్షన్స్’ బ్యానర్ పై ఎం.సత్యనారాయణ రెడ్డి నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రాన్ని మాస్ డైరెక్టర్ వి.వి.వినాయక్ తెరకెక్కించాడు.2005 వ సంవత్సరం సమ్మర్ కానుకగా ఏప్రిల్ 6న విడుదలైన ఈ చిత్రం మొదట మిక్స్డ్ టాక్ ను మూటకట్టుకుంది. కథ మొత్తం వినాయక్ ‘ఆది’ చిత్రానికి సిమిలర్ ఉంది అనే విమర్శలను కూడా మూటకట్టుకుంది.
అయితే తర్వాత రోజు నుండీ పుంజుకుంది. సినిమాలో రఘుబాబు, ఎం.ఎస్.నారాయణ ల కామెడీ అద్భుతంగా పండడం, మాస్ ఆడియెన్స్ కు కనెక్ట్ అయ్యే ఎలిమెంట్స్ ఉండడంతో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం కూడా ఈ చిత్రానికి హైలెట్ గా నిలిచింది. ఈరోజుతో ఈ చిత్రం రిలీజ్ అయ్యి 18ఏళ్ళు పూర్తికావస్తోంది. మరి బాక్సాఫీస్ వద్ద ఫుల్ రన్లో ఈ మూవీ ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం రండి :
నైజాం | 5.60 cr |
సీడెడ్ | 2.04 cr |
ఉత్తరాంధ్ర | 2.88 cr |
ఈస్ట్ | 0.78 cr |
వెస్ట్ | 0.71 cr |
గుంటూరు | 1.13 cr |
కృష్ణా | 1.02 cr |
నెల్లూరు | 0.67 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 14.83 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా+ మలయాళం | 0.60 cr |
ఓవర్సీస్ | 0.28 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 15.71 cr |
‘బన్నీ’ చిత్రానికి రూ.12.6 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ మూవీ రూ.15.71 కోట్ల షేర్ ను రాబట్టింది. బయ్యర్స్ కు ఈ మూవీ రూ.3.1 కోట్ల లాభాలను అందించి హిట్ మూవీగా నిలిచింది. ‘బన్నీ’ తో అల్లు అర్జున్ హ్యాట్రిక్ విజయాలను సొంతం చేసుకున్నాడు.
Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!