థియేటర్లు తెరచుకోవడానికి ప్రభుత్వం అనుమతులు ఇచ్చినా.. ఇంకా థియేటర్లు రన్ అవడం లేదు. కొత్త సినిమాలు రిలీజ్ కావడం లేదు. దీనికి ప్రధాన కారణం ఒక్క తెలంగాణలో తప్ప మిగిలిన చోట్ల లాక్ డౌన్ నిబంధనలు కొనసాగడమే అని తెలుస్తుంది.ఒక్క తెలంగాణ మార్కెట్ ను బట్టి దర్శక నిర్మాతలు తమ సినిమాలను విడుదల చేసుకోవాలి అని భావించడం లేదు.ఆంధ్ర మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా మార్కెట్ లు కుదుటపడిన తర్వాతే కొత్త సినిమాలు విడుదలవుతాయి. పైగా థర్డ్ వేవ్ భయం కూడా జనాల్లో ఉంది కాబట్టి థియేటర్లు తెరచుకున్నా జనాలు వస్తారన్న గ్యారెంటీ లేదు. అందుకే ఇప్పుడు ‘గీతా ఆర్ట్స్’ వంటి అగ్ర సంస్థ కూడా తమ సినిమాలను ఓటిటిలో విడుదల చేసుకోవాలి అని భావిస్తున్నట్టు తెలుస్తుంది.
‘జి.ఎ 2 పిక్చర్స్ వారు.. అఖిల్ తో నిర్మిస్తున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’, నిఖిల్ తో నిర్మిస్తున్న `18 పేజీస్` చిత్రాలు… రెండు కూడా ఓటీటీలో విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల బన్నీ వాస్ మాట్లాడుతూ “పరిస్థితులు ఇంకా చక్కబడినట్టు కనిపించడం లేదని మేము భావిస్తున్నాం. థియేటర్లు తెరుచుకున్నా.. ఫ్యామిలీ ఆడియెన్స్ థియేటర్లకు వస్తారన్న గ్యారెంటీ లేదు.అందుకు ఇంకా సమయం పడుతుంది. ప్రస్తుతం ప్రేక్షకుల ఆలోచనా శైలి ఎలా ఉందో అంచనా వేయడం కష్టంగా మారింది. ఓటిటి ల నుండీ మంచి ఆఫర్లు వస్తే .. తప్పకుండా ఆ దిశగా ఆలోచిస్తాం“ అంటూ ఆయన చెప్పుకొచ్చారు.
మొత్తానికి ఈ రెండు చిత్రాలు ఓటిటిలో విడుదలయ్యే అవకాశం కలదు అని బన్నీ వాస్ హింట్ ఇచ్చారు.అయితే నాగార్జున ఇందుకు అంగీకరిస్తారా అన్నది పెద్ద ప్రశ్న? ఎందుకంటే తన కొడుకు అఖిల్ తో ఓ సాలిడ్ హిట్టు కొట్టించాలని ఆయన.. అతన్ని తీసుకెళ్లి అరవింద్ గారి చేతిలో పెట్టారు. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేస్తున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ పై మంచి అంచనాలే ఉన్నాయి. మరి పోయి పోయి ఈ సినిమాని థియేటర్లలో కాదని ఓటిటిలో విడుదల చేయడానికి నాగార్జున ఒప్పుకునే అవకాశాలు చాలా తక్కువనే చెప్పాలి. చూడాలి మరి ఫైనల్ గా ఏమవుతుందో..!
Most Recommended Video
తన 19 ఏళ్ళ కెరీర్ లో నితిన్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వింటేజ్ ఫిల్మ్ ఫేర్ కవర్స్ పై మన తారలు!
టాలీవుడ్లో రీమేక్ అయిన ఈ 9 సినిమాలు..తమిళంలో విజయ్ నటించినవే..!