Bunny Vasu: పడవ ప్రమాదం నుండి బయటపడ్డ నిర్మాత బన్నీ వాసు!

Ad not loaded.

పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన నరసాపురం, పాలకొల్లు మండలం లో వరదలు సంభవించిన సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా ఎడతెగకుండా కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరి నది పొంగి పొర్లుతుంది. లోతట్టు ప్రాంతాలు అన్నీ జలమయం అయ్యాయి. వరద నీరు కొన్ని గ్రామాలను కూడా చుట్టుముట్టడంతో జనాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రభుత్వం వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం తో పాటు వారికి సహాయక చర్యలు కూడా చేపట్టింది. టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ బన్నీ వాసు కూడా తన సొంత ఊరు అయిన పాలకొల్లు పరిసర ప్రాంతాలకు చెందిన ప్రజలకు సాయం చేసేందుకు వెళ్లారు.

ఈ క్రమంలో ఆయన పెద్ద ప్రమాదం నుండి తప్పించుకోవడం హాట్ టాపిక్ అయ్యింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. “యలమంచిలి నియోజకవర్గంలో బాడవ గ్రామంలో ప్రజలు వరదల్లో చిక్కుకోవడంతో బన్నీ వాసు వారికి సాయమందించేందుకు వెళ్లారు. అక్కడ ఒక గర్భిణికి సాయం చేస్తూ పడవలో తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఒక్కసారిగా వరద ఉధృతి పెరిగడంతో పడవ కొట్టుకోపోసాగింది. కానీ అదృష్టవశాత్తు అది ఓ కొబ్బరి చెట్టుకు తగిలి ఆగడంతో వెంటనే పడవ నడిపే వ్యక్తులు అప్రమత్తమయ్యి వారిని కాపాడారు.

దీంతో బన్నీ వాసు చాలా పెద్ద ప్రమాదం నుండి బయటపడ్డారనే చెప్పాలి. ఇక ఆ పడవలో బన్నీ వాసు అలాగే గర్భిణీ స్త్రీతో సహా ఇంకొంతమంది జనసేన నాయకులు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. మరొపక్క సినిమాల విషయానికి వస్తే ఈ మధ్యనే గోపీచంద్ తో ‘పక్కా కమర్షియల్’ అనే చిత్రాన్ని నిర్మించిన బన్నీ వాస్, నిఖిల్ తో ’18 పేజెస్’ అనే చిత్రాన్ని కూడా నిర్మించారు. అలాగే కిరణ్ అబ్బవరంతో కూడా ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus