ట్రెండీ కామెడీ కథ.. వర్కవుట్ అవుతుందా..?

  • March 4, 2021 / 03:38 PM IST

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఫిబ్రవరి నుండి మార్చి వరకు పెద్దగా సినిమాలు రిలీజ్ చేయరు. చిన్న చితకా తప్ప పేరున్న సినిమాలేవీ కూడా ఆ సమయానికి రావు. కానీ ఈసారి పరిస్థితులు మారాయి. లాక్ డౌన్ అనంతరం జనాలు థియేటర్లలో సినిమాలు చూడడానికి ఆసక్తి చూపిస్తున్నారు. పైగా కరోనా కారణంగా రిలీజ్ కావాల్సిన సినిమాలన్నీ ఆగిపోయాయి. దీంతో ఫిబ్రవరి సెంటిమెంట్ ని పక్కన పెట్టేసి సినిమాలు రిలీజ్ చేయడం మొదలుపెట్టారు. ఈ వారంలో ఏడు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి.

వచ్చేవారం మహాశివరాత్రి కానుకగా మూడు సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఆ మూడు చిత్రాలపై మంచి హైప్ క్రియేట్ అయింది. కాస్ట్ పరంగా చూసుకుంటే ‘శ్రీకారం’, ‘గాలిసంపత్’ సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. వీటితో పాటు ‘జాతిరత్నాలు’ అనే చిన్న సినిమా కూడా రిలీజవుతోంది. రిలీజ్ దగ్గర పడుతున్న కొద్దీ ఈ సినిమాపై ఆసక్తి పెరుగుతోంది. ఈ మధ్యకాలంలో కామెడీకి పెద్ద పీట వేసే సినిమాలు రావడం లేదు. ఇలాంటి సమయంలో ఆడియన్స్ ను ట్రెండీ కామెడీతో అలరించే సినిమాగా ‘జాతిరత్నాలు’ కనిపిస్తోంది.

ఇందులో నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ లాంటి ఈ తరానికి నచ్చే కామెడీ యాక్టర్స్ ఉన్నారు. అనుదీప్ కేవీ డైరెక్ట్ చేసిన ఈ సినిమా నుండి ఇప్పటివరకు వచ్చిన ప్రోమో, పాటలు చాలా ఫన్నీగా ఉన్నాయి. దీంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. పైగా నిర్మాత నాగ్ అశ్విన్ కావడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద క్లిక్ అవుతుందని నమ్ముతున్నారు. మహాశివరాత్రి చిత్రాల్లో ఈ సినిమా విజేతగా నిలిచే ఛాన్స్ కూడా ఉందని అంటున్నారు.

Most Recommended Video

తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!
నాని కొన్ని హిట్ సినిమాలను కూడా మిస్ చేసుకున్నాడు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus