ప్రభాస్ రికార్డులు అక్కడి నుండే మొదలుకాబోతున్నాయట..!

‘బాహుబలి'(సిరీస్) తరువాత ప్రభాస్ రేంజ్ పెరిగిందనేది వాస్తవం. అయితే ఆ క్రెడిట్ అంతా దర్శకుడు రాజమౌళిదే అని కామెంట్ చేసిన వాళ్లకు ‘సాహో’ చిత్రంతో సమాధానం చెప్పాడు ప్రభాస్. ఆ చిత్రం నెగిటివ్ రివ్యూలు మూటకట్టుకున్నప్పటికీ.. 400 కోట్ల పైనే గ్రాస్ కలెక్షన్లను నమోదు చేసి సరికొత్త రికార్డులు సృష్టించింది. బాలీవుడ్ లో అయితే ‘సాహో’ సూపర్ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న ‘రాధే శ్యామ్’ చిత్రం పైన కూడా భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ చిత్రం పూర్తికాకముందే.. మరో రెండు పెద్ద ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ప్రభాస్.

అందులో ఒకటి ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్ తో కాగా మరొకటి ‘తానాజీ’ ఫేమ్ ఓం రౌత్ డైరెక్షన్లో ‘ఆది పురుష్’ సినిమా కావడం విశేషం. ఈ రెండిటిలో ‘ఆది పురుష్’ చిత్రమే ముందుగా సెట్స్ పైకి వెళ్ళనుందని సమాచారం.2021 జనవరి నుండీ ‘ఆదిపురుష్‌’ చిత్రం షూటింగ్‌ మొదలయ్యే అవకాశం ఉందట. ‘ఆది పురుష్’ షూటింగ్ ఎక్కువ శాతం స్టూడియోలోనే గ్రీన్‌ మ్యాట్‌ వేసి చిత్రీకరిస్తారట. బయట ప్రదేశాలలో జరిగే షూటింగ్ పార్ట్ చాలా తక్కువగా ఉంటుందట. ఈ చిత్రానికి గాను వి.ఎఫ్‌.ఎక్స్‌ టీంకే ఎక్కువ పని ఉంటుందని తెలుస్తుంది.

‘బాహుబలి'(సిరీస్) కోసం దర్శకుడు రాజమౌళి దాదాపు 45000 వి.ఎఫ్‌.ఎక్స్‌ షాట్స్‌ను ఉపయోగించారని.. ఆయనే ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. ఇప్పుడు ‘ఆది పురుష్’ కోసం దర్శకుడు ఓం రౌత్.. ‌ ‘బాహుబలి’ కంటే ఎక్కువ వి.ఎఫ్‌.ఎక్స్‌లో షాట్స్ ఉపయోగించబోతున్నారని సమాచారం. కాబట్టి ‘ఆది పురుష్’ తో ప్రభాస్ రికార్డులు అక్కడి నుండే మొదలుకాబోతున్నాయని తెలుస్తుంది.

Most Recommended Video

బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
బిగ్‌బాస్ ఇంట్లో అభిజీత్‌ లాంటోడు ఉండాల్సిందే!
బిగ్ బాస్ 4 నామినేషన్: కిటికీల ఆటలో తలుపులు మూసేసింది ఎవరికంటే?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus