Adipurush: ‘ఆదిపురుష్‌’ సినిమాపై అంచనాలు పెంచేసిన పీవీఆర్‌… తెలుగే స్పెషల్‌ అంటూ…!

దేశవ్యాప్తంగా ఇప్పుడు సినీ ప్రేక్షకులు ఏదైనా సినిమా కోసం ఎదురుచూస్తున్నారు అంటే… సోషల్ మీడియా మొత్తం ఏదైనా విషయం గురించి చర్చిస్తోంది అంటే… అది కచ్చితంగా ‘ఆదిపురుష్‌’ గురించే అని చెప్పాలి. ఈ సినిమా ఎలా ఉంటుంది? ఎలాంటి ఫలితం సాధిస్తుంది లాంటి విషయాల గురించి తర్వాత మాట్లాడితే.. ఈ సినిమా తొలి రోజు వసూళ్లు, సినిమా టికెట్ల గురించే ఎక్కువగా మాట్లాడుతున్నారు. వాటి సంగతి వేరే వార్తగా మన సైట్‌లో చూడొచ్చు. అయితే ఇక్కడ చర్చ అంతా ఈ సినిమా తొలి రోజు వసూళ్లు ఎంత? ఇదే తాజా ప్రశ్న.

అసలు ఈ ప్రశ్న ఎందుకు వచ్చింది అంటే.. ఈ సినిమా గురించి ప్రముఖ మల్టీప్లెక్ల్స్‌ సీఈవో చేసిన వ్యాఖ్యల వల్లే. పాన్‌ ఇండియా సినిమా విడుదలవుతున్న ‘ఆదిపురుష్‌’.. పీవీఆర్‌ మల్టిప్లెక్స్‌లో పెద్ద ఎత్తున రిలీజ్‌ చేస్తున్నారు. తొలి రోజు అయితే 24 గంటలు సినిమా ప్రదర్శించేలా ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఈ నేపథ్యంలో తొలి రోజు వసూళ్ల గురించి పీవీఆర్‌ ఐనాక్స్‌ సీఈవో గౌతమ్‌ దత్తా చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఈ మేరకు ఆయన ఓ స్పెషల్‌ వీడియో ద్వారా తన ఆలోచనలు పంచుకున్నారు.

జూన్ 16న వివిధ భాషల్లో ‘ఆదిపురుష్‌’ రిలీజ్‌కి సిద్ధంగా ఉంద. ఓవైపు ఫ్రీ టికెట్ల ప్రచారం, మరోవైపు రాముడు – ఆంజనేయుడు ప్రచారం వల్ల బజ్‌ భారీగా ఉంది. అలాగే అడ్వాన్స్‌ బుకింగ్‌లు కూడా అదిరిపోయాయి. ఈ లెక్కన 16వ తేదీన సుమారు రూ. 85 కోట్ల వసూళ్లు ఉంటాయని పీవీఆర్‌ చెబుతోంది. అంతేకాదు ఈ వసూళ్లను అధిక మొత్తం తెలుగు రాష్ట్రాల నుండే వస్తాయని కూడా చెప్పింది. దీంతో సినిమా మీద బజ్‌ మరింత పెరిగింది అంటున్నారు.

అన్నీ అనుకున్నట్లుగా జరిగితే తొలి రోజు బజ్‌ పుణ్యాన శని, ఆదివారాల్లో కూడా భారీ వసూళ్లు వస్తాయి. అలా ఒకే రోజులో రూ. 100 కోట్ల వసూళ్లు సాధించే అవకాశం కూడా ఉంది అంటున్నారు సినీ పరిశీలకులు. మరి ‘ఆదిపురుష్‌’ ఏం చేస్తుంది… వసూళ్ల సంగతి ఏంటి అనేది చూడాలి.

టక్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!

అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్లేనా..!/a>
కలెక్షన్లలో దూసుకుపోతున్న లేడీ ఓరియంటల్ సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus