Vidaamuyarchi: అజిత్ ‘విదాముయార్చి’.. ప్రమోషన్ లేకుండా బజ్ కుదిరేనా?

కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ (Ajith Kumar)  నుంచి వస్తున్న హై యాక్షన్ ఎంటర్‌టైనర్ విదాముయార్చి (Vidaamuyarchi) పై భారీ అంచనాలే ఉన్నాయి. మాగజ్ తిరుమేని (Magizh Thirumeni) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో త్రిష (Trisha) ఫిమేల్ లీడ్ గా నటించగా, అర్జున్ (Arjun Sarja), రెజీనా (Regina Cassandra) కీలక పాత్రలు పోషిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ పాన్ ఇండియా మూవీకి అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) సంగీతం అందిస్తుండటంతో మ్యూజిక్ లవర్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ మూవీ పలు కారణాల వల్ల వాయిదా పడింది.

Vidaamuyarchi

తాజాగా, ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. అయితే తెలుగు మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని నిర్మాతలు ప్రత్యేకంగా ప్రమోషన్ ప్రయత్నాలు చేయడం లేదనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ఆకట్టుకున్నప్పటికీ, ఆఫ్‌లైన్ ప్రమోషన్స్ లేకపోవడంతో సినిమాపై పెద్దగా హైప్ క్రియేట్ కాలేదు. కోలీవుడ్‌లో అజిత్ సినిమాల‌కు ఎప్పుడూ భారీ ఓపెనింగ్స్ వస్తాయి. కానీ తెలుగులో పరిస్థితి భిన్నం. అజిత్ ఫ్యాన్ బేస్ తమిళనాడులో భారీగా ఉన్నప్పటికీ, తెలుగులో పెద్దగా మార్కెట్ లేదు.

గతంలో వచ్చిన తేరు, వాలిమై, తునివు వంటి సినిమాలు తెలుగులో ఆశించిన రీతిలో ప్రభావం చూపలేకపోయాయి. మరి విదాముయార్చి కూడా అదే పరిస్థితిని ఎదుర్కొంటుందా? అనేది ఆసక్తికరంగా మారింది. అజిత్ పర్సనల్‌గా సినిమా ప్రమోషన్స్‌కు దూరంగా ఉండటం తెలుగు బజ్ తగ్గించడానికి మరో కారణం. ఇటీవల మేకర్స్ సోషల్ మీడియా ప్రమోషన్స్ పై ఎక్కువ ఫోకస్ పెట్టారు. అయితే సినిమా హైప్ పెరగాలంటే ఆఫ్‌లైన్ ప్రమోషన్స్ కూడా ఉండాలి. ముఖ్యంగా స్టార్ హీరోలు ఇంటర్వ్యూలు, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ వంటి కార్యక్రమాల్లో పాల్గొంటే, ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతుంది.

అజిత్ ప్రమోషన్స్ చేయకపోయినా, మిగతా టీమ్ ఈ విషయంలో ముందు రావాలి. కొన్ని రోజులు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో, తెలుగు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్ రాబోతుందనేది ఆసక్తిగా మారింది. హై బడ్జెట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీ, కంటెంట్ పరంగా ఆకట్టుకుంటే మౌత్ టాక్‌తో కచ్చితంగా బిజినెస్ క్రియేట్ చేయగలదు. మరి విదాముయార్చి హైప్ పెంచడానికి మేకర్స్ ఇంకేమైనా ప్లాన్ చేయాలనుకుంటున్నారా? లేదా ప్రాముఖ్యత లేకుండానే సినిమా రిలీజై విజయం సాధిస్తుందా? అనేది వేచి చూడాలి.

న్యూ లుక్ తో ఎన్టీఆర్ సర్ ప్రైజ్.. దేనికోసం?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus