ఎన్టీఆర్ (Jr NTR) ఎక్కడ కనిపించినా స్టైల్, ప్రెజెన్స్ గురించి ప్రత్యేకంగా చర్చించాల్సిందే. తాజాగా ఆయన భార్య లక్ష్మీ ప్రణతితో కలిసి ఎయిర్‌పోర్ట్‌లో దర్శనమిచ్చారు. తన స్టైలిష్ లుక్, క్యాజువల్ డ్రెస్‌తో అభిమానులను ముగ్ధుల్ని చేశారు. వైట్ టీ-షర్ట్, బ్లాక్ ట్రౌజర్స్, స్టైలిష్ కళ్లజోడుతో కనిపించిన ఎన్టీఆర్.. ఎయిర్‌పోర్ట్ లుక్‌లోనూ మాస్ అటిట్యూడ్‌ను కొనసాగించారు. మరోవైపు, లక్ష్మీ ప్రణతి కూడా సింపుల్ యెట్ ఎలిగెంట్ స్టైల్‌తో ట్రెండ్‌ను ఫాలో అయ్యారు. వీరి క్యూట్ కపుల్ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్ అవుతున్నాయి.
ఇటీవల ఎన్టీఆర్ బిజీ షెడ్యూల్ కారణంగా ఎక్కువగా పబ్లిక్‌లో కనిపించలేదు. అందుకే, ఆయన లేటెస్ట్ లుక్ చూసిన ఫ్యాన్స్ తెగ ఎగ్జైట్ అవుతున్నారు. ఎన్టీఆర్ ఎప్పుడూ తన లుక్‌లో కొత్తదనం తీసుకురావడంలో ముందుంటాడు. ఇప్పటివరకు కనిపించిన ఫోటోల్లో, రఫ్ అండ్ టఫ్ లుక్‌లో డీప్ బ్లాక్ షేడ్స్‌తో అదరగొట్టారు. ఫ్యాన్స్ మాత్రం ఈ లుక్ NTR 31 లేదా వార్ 2 కోసం స్పెషల్‌గా ప్రిపేర్ చేస్తున్నదేనా? అని నేషనల్ లెవెల్‌లో చర్చిస్తున్నారు.
ఇదిలా ఉండగా, ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. NTR 31 సినిమా ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రానుంది. ఇదే కాదు, బాలీవుడ్ హిట్ ఫ్రాంచైజీ వార్ 2 లోనూ హృతిక్ రోషన్‌తో (Hrithik Roshan) కలిసి నటిస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్ మార్కెట్‌లో ఎన్టీఆర్ క్రేజ్ పెరుగుతుండటంతో, ఈ సినిమాతో మరింత పాన్-ఇండియా ఇమేజ్‌ను బలపరిచే అవకాశముందని అంటున్నారు. గత ఏడాది దేవర 1 (Devara) తో కమర్షియల్‌గా ఘన విజయం అందుకున్న తారక్, వరుసగా కొత్త ప్రాజెక్ట్‌లను లైన్‌లో పెడుతున్నారు.
ఎన్టీఆర్ లుక్ పరంగా ప్రతి సినిమాలో కొత్త స్టైల్‌ను ట్రై చేస్తూ వస్తున్నాడు. ఇక లీకైన ఎన్టీఆర్ లుక్ చూస్తుంటే, రాబోయే సినిమాల్లో మరింత మాస్, స్టైలిష్ అటిట్యూడ్‌ను చూపించబోతున్నాడని స్పష్టమవుతోంది. ఎయిర్‌పోర్ట్‌లో ఇలా తారక్ కనిపించడం సహజమైన విషయమే అయినా, ప్రతి లుక్‌ను ఓ స్టేట్‌మెంట్‌లా మార్చడం ఎన్టీఆర్‌కు ప్రత్యేకత. కాబట్టి, ఆయన బాడీ లాంగ్వేజ్, స్టైల్ చూసినంత సేపూ ఫ్యాన్స్ ఆనందించటం ఖాయం. మరి NTR 31 లో ఈసారి ఎలాంటి లుక్‌తో మెస్మరైజ్ చేయబోతాడో చూడాలి.