స్వరభాస్కర స్థాయిలో అమలాపాల్ మెప్పించగలదా ??

బాలీవుడ్ లో ఓ రెండు నెలల క్రితం విడుదలై.. విమర్శకుల ప్రశంసలతోపాటు ప్రేక్షకుల అభినందనలు అందుకొన్న చిత్రం “నీల్ బట్టే సన్నాట”. తన కూతుర్ని కలెక్టర్ చేయాలనుకొనే ఓ తల్లి పడే తపనను అత్యద్భుతంగా తెరకెక్కించారు. ముఖ్యంగా.. తల్లి పాత్ర పోషించిన స్వరభాస్కర సదరు పాత్రకు తనదైన నటనతో ప్రాణప్రతిష్ట చేసి, సినిమా విజయంలో ముఖ్యభూమిక పోషించింది. ఇప్పుడే అదే సినిమాను తమిళంలో “అమ్మ కనుక్కు” పేరుతో రీమేక్ చేస్తున్నారు. తమిళ స్టార్ కథానాయకుడు ధనుష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. అమలాపాల్ ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఇటీవల ఈ చిత్రం ట్రైలర్ విడుదలైంది. సీన్ టు సీన్ ఎటువంటి మార్పులు లేకుండా దించేశారు.

అందులే తప్పేమీ లేదు కానీ.. హిందీలో స్వరభాస్కర పోషించిన పాత్రను తమిళంలో అమలాపాల్ పోషిస్తోంది. అమలాపాల్ మంచి నటి అయినప్పటికీ.. స్వరభాస్కరతో పోల్చితే మాత్రం తేలిపోతుంది. ఇది ఎలాగూ మల్టీప్లెక్స్ సినిమా కాబట్టి.. అందరూ హిందీ సినిమాతో కంపేర్ చేస్తారు.
అప్పుడు అమలాపాల్ నటనను కూడా స్వరభాస్కర పెర్ఫార్మెన్స్ తో కంపేర్ చేయడం సహజం. మరి ఆ స్థాయిలో అమలాపాల్ తల్లి పాత్రలో ఇమడగలిగిందా? లేదా? అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus