‘శుభం కార్డు పడ్డట్లే… ఈ నెల మూడో వారంలోపు టాలీవుడ్ గుడ్ న్యూస్ వింటుంది’ – ఈ మాట ఎక్కడో విన్నట్లు ఉంది కదా. అంతమంది స్టార్ హీరోలు, దర్శకులు చెప్పిన మాట కదా.. పదే పదే వినే ఉంటారు. సినిమా పెద్దల టీమ్‌ను లీడ్ చేసిన చిరంజీవి తొలుత ఈ మాట చెప్పారు. అయితే అనుకున్న తేదీ, చెప్పిన టైమ్ అయిపోయింది కాబట్టి ఓసారి గుర్తు చేసే ప్రయత్నమే ఇది. బాసూ… చెప్పిన డేట్ అయిపోయింది. నెల పూర్తవ్వడానికే ఇంకా నాలుగు రోజులే ఉంది. ఏదా? శుభం కార్డు.
‘‘సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు, మా ప్రతిపాదనలపై సానుకూలంగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. అందరికీ లాభదాయకంగా ఉండేలా ఆయన తీసుకున్న నిర్ణయం సంతోషపరిచింది. ఐదో షోకు మేము అనుమతి కోరగా.. సీఎం ఆమోదం చెప్పారు. భారీ బడ్జెట్ చిత్రాలకు ప్రత్యేకించి వెసులుబాటు కోరగా.. మరోసారి కమిటీతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని సీఎం చెప్పారు. మూడో వారంలోపు సినీ పరిశ్రమకు సంబంధించిన జీవో వచ్చే అవకాశం ఉంది’’ ఇదీ చిరంజీవి ఆ రోజు చెప్పిన మాటల సారాంశం.
అనుకున్నవన్నీ అనుకున్న సమయానికి అవ్వాలని లేదు. కానీ అనుకున్నవి అయిపోతాయేమో అనుకుని సినిమా విడుదలకు సిద్ధమైన సొంత తమ్ముడికి ఇబ్బంది కలుగుతోంది సార్ అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ‘భీమ్లా నాయక్’ సినిమాకు ఏపీలో అదనపు ధర అవకాశం, అదనపు షో… లాంటి సౌకర్యాలు కల్పించలేదు. అలాగే పాత ధరలతోనే టికెట్లు అమ్మాల్సిందిగా ప్రభుత్వం తాఖీదులు ఇస్తోంది. లేదంటే చర్యలు తీసుకుంటామని కూడా చెబుతోంది. దీంతో ఎండ్ కార్డు ఎక్కడా అంటూ నెటిజన్లు, పవన్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఓవైపు తెలంగాణలో సినిమాకు, సినిమా పరిశ్రమకు అనుకూలంగా నిర్ణయాలుంటే… ఆంధ్రప్రదేశ్‌లో అలాంటి పరిస్థితే లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. అయితే కమిటీ నుండి ఇంకా నివేదిక రాలేదని, అందులో టికెట్ రేట్ల పెంపు నిర్ణయం వాయిదా పడింది అనే సన్నాయి నొక్కులు అయితే వినిపిస్తున్నాయి. ఇందులో నిజమేంటో దేవుడికే ఎరుక. ఆఖరిలో సార్ ఫిబ్రవరి పూర్తవ్వడానికి ఇంకా నాలుగు రోజులే ఉంది.
Most Recommended Video
బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!