యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రంతో బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా పరిచయమయ్యాడు. రాజమౌళి దర్శకత్వం వహించిన సినిమా కావడంతో సినిమా పై మొదటి నుండీ మంచి అంచనాలే ఏర్పడ్డాయి. మార్చి 25 న విడుదలైన ఈ చిత్రం అక్కడి బాక్సాఫీస్ వద్ద కొంచెం స్లోగా స్టార్ట్ అయినప్పటికీ… మెల్ల మెల్లగా పికప్ అవుతుంది. మొదటి రోజుతో పోలిస్తే రెండో రోజు, రెండో రోజుతో పోలిస్తే మూడో రోజు.. అలా రోజు రోజుకి ఈ చిత్రానికి అక్కడ ఆదరణ పెరుగుతుంది.
ఎన్టీఆర్ నటనకి అక్కడ మంచి మార్కులే పడ్డాయి. ‘కొమరం భీమూడో’ పాటలో ఎన్టీఆర్ నటన అద్భుతంగా ఉందని తమిళ ప్రేక్షకులతో పాటు హిందీ ప్రేక్షకులు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. పైగా నార్త్ ప్రమోషన్లలో హిందీలో అనర్గళంగా మాట్లాడిన ఎన్టీఆర్ ను చూసి అక్కడి జనాలు బిత్తరపోయారు అనే చెప్పాలి. ఫుల్ రన్లో ‘ఆర్.ఆర్.ఆర్’.. బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ఫుల్ మూవీగా నిలబడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ‘బాహుబలి'(సిరీస్) తరువాత ప్రభాస్ ను ఓన్ చేసుకున్న నార్త్ జనాలు..
ఎన్టీఆర్ ను ఓన్ చేసుకుంటాయా. చరణ్ కు కూడా అక్కడ మంచి ఆదరణ లభించింది. కాకపోతే చరణ్ అల్లూరి పాత్రని పోషిస్తే.. అక్కడి జనాలు రాముడు అంటూ ఫీలవుతున్నారు. చరణ్ తర్వాతి సినిమా శంకర్ డైరెక్షన్లో చేస్తున్నాడు. అది కూడా హిందీలో రిలీజ్ అవుతుంది. మరి ఎన్టీఆర్ తర్వాత సినిమాలు హిందీ మార్కెట్ ను బేస్ చేసుకుని రూపొందుతాయా? ఒకవేళ రూపొందిన అక్కడి జనాలను ఆకట్టుకుంటాయా? అనేది తెలియాల్సి ఉంది.
‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. అటు తర్వాత ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు దర్శకుడితో ఓ మూవీ చేస్తాడు. అవి రెండు కంప్లీట్ అయ్యాక ‘కె.జి.ఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ తో సినిమా చేయాల్సి ఉంది.
Most Recommended Video
‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?