‘RX 100’ సినిమాలో బోల్డ్ క్యారెక్టర్ లో నటించడం వలన పాయల్ కి ఆ సినిమా తరువాత కూడా అలాంటి అవకాశాలే వచ్చాయి. మొదటి సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకున్నప్పటికీ ఆమె కెరీర్ ఏమంత సజావుగా సాగలేదు. ఆమె చేత కొందరు దర్శకనిర్మాతలు దిగువ స్థాయి పాత్రలు చేయించారు. అలా పాయల్ నటించిన సినిమా ఒకటి తీవ్ర విమర్శలకు దారి తీసింది. ‘వెంకీమామ’, ‘డిస్కోరాజా’ వంటి చిత్రాల్లో అవకాశం పొందిన.. ఆమె చేసిన ఒక థర్డ్ గ్రేడ్ సినిమా మాత్రం ఆమెకి ఒక మచ్చగా మారిపోయింది.
పాయల్ అంటే బోల్డ్ పాత్రల్లోనే కనిపిస్తుందనే ఇమేజ్ ఒకటి వచ్చేసింది. ఇదే సమయంలో ఆమె పెద్ద హీరోల సరసన నటించిన సినిమాలు ప్రత్యేకమైన గుర్తింపును తీసుకురాలేకపోయాయి. ఈ క్రమంలో తన ఇమేజ్ ని మార్చుకునే పనిలో పడిందట పాయల్. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తోన్న తదుపరి సినిమాలో పూర్తి విభిన్నమైన పాత్రలో కనిపిస్తుందట. ఒక ఐపీసీ రోల్ లో కనిపిస్తుందట. ఈ సినిమాతో పాయల్ ఇమేజ్ మారిపోతుందని నమ్మకంగా చెబుతున్నారు చిత్ర దర్శకనిర్మాతలు. ప్రస్తుతానికి పాయల్ కి హిట్ తో పాటు మంచి ఇమేజ్ కూడా ఎంతో అవసరం!
Most Recommended Video
‘హిట్ ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘టాలీవుడ్ స్టార్ హీరోల రెమ్యూనరేషన్లు!