Prabhas: స్టార్ హీరో ప్రభాస్ ఆ రికార్డును సులువుగా సాధిస్తారా?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన ప్రభాస్ ప్రస్తుతం వరుసగా క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. ఒకవైపు స్టార్ డైరెక్టర్లకు ఛాన్స్ ఇస్తూనే మరోవైపు యంగ్ డైరెక్టర్లతో పని చేయడానికి కూడా ప్రభాస్ ఆసక్తి చూపిస్తున్నారు. ప్రభాస్ నటించిన ఆదిపురుష్ మూవీ నేడు థియేటర్లలో విడుదల కాగా మెజారిటీ ఆడియన్స్ ఈ సినిమా గురించి పాజిటివ్ గా స్పందించడం గమనార్హం. ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కే సినిమాలతో ప్రభాస్ హ్యాట్రిక్ సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

ఈ మూడు సినిమాలపై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండగా ప్రభాస్ హ్యాట్రిక్ సాధించడం కష్టం కాదని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. స్టార్ హీరో ప్రభాస్ వేగంగా సినిమాల్లో నటిస్తానని ఇప్పటికే అభిమానులకు మాటిచ్చారు. ప్రభాస్ సినిమాలు 300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి. ప్రభాస్ పారితోషికం సైతం 100 నుంచి 150 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. ప్రభాస్ ఇతర భాషల్లో సైతం సత్తా చాటే విధంగా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు.

ఆదిపురుష్ సినిమాకు భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రభాస్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లైన సలార్, ప్రాజెక్ట్ కే సినిమాలకు భారీ స్థాయిలో ఆఫర్లు వస్తుండటం గమనార్హం. ప్రభాస్ మాస్, క్లాస్ సినిమాలు అనే తేడాల్లేకుండా అన్ని జానర్ల సినిమాలలో నటిస్తూ సత్తా చాటుతున్నారు. ప్రభాస్ స్థాయిలో ఇతర హీరోల సినిమాలకు బిజినెస్ అయితే జరగడం లేదు.

వివాదాలకు దూరంగా ఉంటున్న ఈ హీరో తన మంచితనంతో అభిమానుల హృదయాలను గెలుచుకుంటున్నారు. ప్రభాస్ గ్లోబల్ స్టార్ ఇమేజ్ ఆయన కెరీర్ కు ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్లస్ అవుతుందేమో చూడాలి. ప్రభాస్ (Prabhas) డైరెక్టర్ల గత సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా టాలెంట్ ను నమ్మి ఛాన్స్ ఇస్తున్నారు.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus