Prabhas: సొంత రికార్డులను బ్రేక్ చేయడం ప్రభాస్ కు సాధ్యమేనా?

టాలీవుడ్ పాన్ ఇండియా హీరోలలో ఒకరైన ప్రభాస్ తన సినిమాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా రికార్డులను క్రియేట్ చేశారు. బాహుబలి2, సాహో సినిమాలతో బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ప్రభాస్ బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఊహించని స్థాయిలో రికార్డులను క్రియేట్ చేశారు. అయితే ఈ రికార్డులను బ్రేక్ చేయాల్సిన బాధ్యత కూడా ప్రభాస్ పైనే ఉంది. సలార్, ప్రాజెక్ట్ కే సినిమాలతో ప్రభాస్ తన రికార్డులను తాను బ్రేక్ చేస్తాననే నమ్మకాన్ని కలిగి ఉన్నారు.

బాహుబలి2 బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద 510 కోట్ల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకోగా సలార్ మూవీతో ఈ రికార్డ్ బ్రేక్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రభాస్ సలార్ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతోందని తెలుస్తోంది. ఈ నెలాఖరు నాటికి సలార్ పార్ట్1 షూట్ పూర్తి కానుంది. ఈ ఏడాది సెప్టెంబర్ లో ఈ సినిమా రిలీజ్ కానుంది. సలార్ పార్ట్2 షూటింగ్ ను కూడా శరవేగంగా పూర్తి చేయాలని ప్రశాంత్ నీల్ భావిస్తున్నారు.

సలార్ పార్ట్2 షూట్ పూర్తైన తర్వాతే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ సెట్స్ పైకి వెళుతుందని సమాచారం. తారక్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళుతుందని సమాచారం. టాలీవుడ్ స్టార్ హీరోలలో చాలామంది హీరోలు ఒక్కో సినిమాకు రెండేళ్ల సమయం కేటాయిస్తూ ఉండటంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తారక్ మూవీ వచ్చే ఏడాదిలో రిలీజ్ కావడంపై ఫ్యాన్స్ హ్యాపీగా లేరు.

ఈ సినిమా షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేస్తే బాగుంటుందని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కెరీర్ విషయంలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటున్న ఎన్టీఆర్ వేగంగా సినిమాలలో నటించడం కంటే ఆచితూచి సినిమాలలో నటించడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. తారక్ కొత్త సినిమాలకు సంబంధించిన ప్రకటన ఇప్పట్లో లేనట్టేనని సమాచారం.

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus