‘ఆర్.ఆర్.ఆర్’ తో రాజమౌళి బాలీవుడ్ ను మెప్పించగలడా..?

రాజమౌళి చిత్రాల్లో హీరో ఎలేవేషన్స్ ఏ స్థాయిలో ఉంటాయనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక హీరో తరువాత రాజమౌళి ఎక్కువగా స్క్రీన్ టైం కేటాయించేది ప్రతినాయకుడు పాత్రకే. ఈ క్రమంలో హీరోయిన్ కు గానీ మిగిలిన లేడీ ఆర్టిస్టులకి అయన ఇచ్చే స్క్రీన్ టైం కానీ ప్రాధాన్యత కానీ చాలా తక్కువ ఉంటుందనే చెప్పాలి. సినిమాలో ఒక హీరో అయితేనే ఇలాంటి పరిస్థితి ఉంటే ఇక ఇద్దరు హీరోలు ఉంటే… ఇక ఆ పరితస్థితి ఎలా ఉంటుందనేది మనం ఊహించుకోవచ్చు. ఇక అసలు విషయంలోకి వెళితే ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రంలో తారక్, చరణ్ వంటి స్టార్ హీరోలు నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ చిత్రంలో చరణ్ సరసన హీరోయిన్ గా అలియా భట్ నటిస్తుంది. అలియా కి గ్లామర్‌ పాత్రల కంటే పెర్‌ఫార్మెన్స్ ఉన్న పాత్రలే ఎక్కువ క్రేజ్ తెచ్చిపెట్టాయి. ‘రాజీ’ చిత్రానికి గాను అవార్డులన్నీ ఆమే గెలుచుకున్న సంగతి తెలిసిందే. ప్రతీ సినిమాలోనూ తన నటనతో ప్రేక్షకుల్ని కట్టి పడేసే ఆలియాకి ఇద్దరు మాస్‌ హీరోలు ఉన్న చిత్రంలో ఎలాంటి పాత్ర ఇచ్చి రాజమౌళి బాలీవుడ్ ప్రేక్షకులకి న్యాయం చేయగలడు అనేది పెద్ద ప్రశ్న. ‘బాహుబలి’ లాంటి చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడితో పనిచేయాలనే కోరికతోనే ఆలియా ఈ ప్రాజెక్ట్ ను ఓకే చేసిందట. ఈ ప్రాజెక్ట్ కోసం కరణ్‌ జోహార్‌ ఆమెని కన్విన్స్‌ చేసినట్టు తెలుస్తుంది. ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రంలో తన పాత్ర ఏమిటనేది కూడా అలియా అడగలేదట. మరి అలియా పాత్రకి మన జక్కన్న న్యాయం చేయగలడా అంటే 2020 జులై 30 వరకూ వేచి చూడాల్సిందే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus