Jr NTR: తారక్ లుక్ పై అంచనాలు మామూలుగా లేవుగా..?

దాదాపు 450 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కి ఈ ఏడాది విడుదల కాబోతున్న ఆర్ఆర్ఆర్ సినిమాపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి. ప్రీ రిలీజ్ బిజినెస్ పరంగా కొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్న ఆర్ఆర్ఆర్ కలెక్షన్లపరంగా కూడా కొత్త రికార్డులను క్రియేట్ చేస్తుందని చరణ్ ఫ్యాన్స్ తో పాటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. కొన్ని రోజుల గ్యాప్ తో విడుదలైన చరణ్, అజయ్ దేవగణ్ పాత్రలకు సంబంధించిన పోస్టర్లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

చరణ్, అజయ్ పోస్టర్లు ఆర్ఆర్ఆర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు ప్రేక్షకుల అంచనాలను మించి ఉండటంతో రాజమౌళి త్వరలో విడుదల చేయబోతున్న ఎన్టీఆర్ పోస్టర్ ఇప్పటివరకు వచ్చిన పోస్టర్లను మించి ఉంటుందని ఎన్టీఆర్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి రాజమౌళి ప్రేక్షకుల అంచనాలను అందుకుంటారో లేదో చూడాల్సి ఉంది. మే 20వ తేదీన తారక్ లుక్ కు సంబంధించిన పోస్టర్ రిలీజ్ కానుంది. కొమురం భీమ్ పాత్రలో రాజమౌళి తారక్ ను ఏ విధంగా చూపించబోతున్నారో అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య చర్చ జరుగుతోంది.

మరోవైపు ఈ సినిమాలో ఇద్దరు స్టార్ హీరోలు నటిస్తున్న నేపథ్యంలో ఏ హీరోకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందనే చర్చ ఫ్యాన్స్ మధ్య జరుగుతోంది. అయితే ఆర్ఆర్ఆర్ సినిమాకు పని చేసిన సాంకేతిక నిపుణులు మాత్రం రాజమౌళి ఇద్దరు హీరోలకు సమ ప్రాధాన్యత ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారని చెబుతున్నారు. అక్టోబర్ 13వ తేదీన రిలీజ్ డేట్ ప్రకటించిన నేపథ్యంలో రాజమౌళి రేయింబవళ్లు పని చేస్తూ ఆ డేట్ కు సినిమా రిలీజ్ అయ్యే విధంగా కష్టపడుతున్నారు. జూన్ నెలాఖరు వరకు ఆర్ఆర్ఆర్ షూటింగ్ జరగనుండగా సెప్టెంబర్ రెండవ వారం నాటికి ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తవుతాయని తెలుస్తోంది.

Most Recommended Video

వైల్డ్ డాగ్ సినిమా రివ్యూ & రేటింగ్!
సుల్తాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus