మెగాపవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం ‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ‘ఆచార్య’ చిత్రంలో కూడా నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు. ఈ రెండు చిత్రాలు 2021 లోనే విడుదల కాబోతున్నాయి. ముందుగా ‘ఆచార్య’ చిత్రం మే 13న విడుదల కాబోతుంది. చిరు -కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో చరణ్ 45నిమిషాల నిడివి గల పాత్రను చేస్తున్నాడు. ఇక ఆయన రాజమౌళి డైరెక్షన్లో చేస్తున్న ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం అక్టోబర్ 13న విడుదల కాబోతుంది.
అయితే ‘ఆర్.ఆర్.ఆర్’ తరువాత చరణ్ ‘జెర్సీ’ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి అలాగే స్టార్ డైరెక్టర్ శంకర్ లతో చరణ్ తదుపరి సినిమా ఉంటుందని ప్రచారం జరిగింది. అయితే ఈ రోజు అఫిషియల్ గా ఈ సినిమాకి సంబంధించిన అధికార ప్రకటన వచ్చేసింది. ఈ ప్రాజెక్ట్ ను సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాడట. ప్రస్తుతం ఈయన చెన్నైలో ఉన్నట్టు తెలుస్తుంది. ఈ ప్రాజెక్టు గురించే శంకర్ తో డిస్కషన్లు జరుపుతున్నాడట. పాన్ ఇండియా మూవీగానే ఈ ప్రాజెక్టు రూపొందుతోందని సమాచారం.
అయితే రాజమౌళి తో ‘ఆర్.ఆర్.ఆర్’ చెయ్యడం కోసం ఏకంగా 2ఏళ్ళు డేట్స్ ఇచ్చిన చరణ్.. ఇప్పుడు శంకర్ తో మూవీకి కూడా 2ఏళ్ళ వరకూ డేట్స్ ఇస్తాడా అని కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే శంకర్ తో చరణ్ చెయ్యబోయే చిత్రం ఏడాది లోపే ఫినిష్ చెయ్యాలనేది అగ్రిమెంట్ అని సమాచారం. నిజానికి ‘ఇండియన్2’ చిత్రాన్ని కూడా దిల్ రాజే నిర్మించాలని ట్రై చేసాడు. కానీ చివరి నిమిషంలో తప్పుకున్నాడని అప్పట్లో వార్తలు వచ్చాయి.
Most Recommended Video
వామ్మో.. సుమంత్ ఇన్ని హిట్ సినిమాలను మిస్ చేసుకున్నాడా..!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
ఈ 10 మంది బుల్లితెర సెలబ్రిటీలు 30 ఏళ్ళ వయసొచ్చినా పెళ్లి చేసుకోలేదట..!