Rajamouli: జక్కన్న పొరపాటు ఆర్ఆర్ఆర్ కు మైనస్ అయిందా?

ఆర్ఆర్ఆర్ మూవీ థియేటర్లలో రిలీజ్ కావడానికి మరికొన్ని రోజుల సమయం మాత్రమే ఉంది. ఆర్ఆర్ఆర్ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ ఊహించని స్థాయిలో జరుగుతున్నాయి. ఫస్ట్ వీకెండ్ వరకు ఈ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఫస్ట్ వీకెండ్ తర్వాత ఈ సినిమాకు టికెట్ రేట్లను తగ్గిస్తే బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. చరణ్, తారక్ కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్ కు ముందే ఊహించని స్థాయిలో రికార్డులను క్రియేట్ చేస్తోంది.

Click Here To Watch NEW Trailer

అయితే భీమ్లా నాయక్ సాధించిన ఒక రికార్డును మాత్రం ఆర్ఆర్ఆర్ మూవీ బ్రేక్ చేయలేకపోవడం గమనార్హం. జక్కన్న తెలుగు రాష్ట్రాల్లో ఈవెంట్ చేయకుండా చేసిన పొరపాటు ఆర్ఆర్ఆర్ కు మైనస్ అయిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. తాజాగా ఆర్ఆర్ఆర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ చిక్ బళ్లాపూర్ లో జరిగింది. అయితే భీమ్లా నాయక్ నిర్మాణ సంస్థల సింగిల్ ఛానెల్ వ్యూస్ విషయంలో 1,84,000 వ్యూస్ తో రికార్డు క్రియేట్ చేసింది.

ఆర్ఆర్ఆర్ మాత్రం కేవలం 1,53,000 వ్యూస్ ను సాధించడం గమనార్హం. ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్ వ్యూస్ విషయంలో భీమ్లా నాయక్ రికార్డ్ ను ఆర్ఆర్ఆర్ బ్రేక్ చేయకపోవడం గురించి కొంతమంది ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ విషయం గురించి జోరుగా చర్చ జరుగుతోంది. అయితే చరణ్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ హైదరాబాద్ లో ఈ సినిమా ఈవెంట్ జరిగి ఉంటే వ్యూస్ మరోలా ఉండేవని చెబుతున్నారు.

అయితే ఆర్ఆర్ఆర్ భీమ్లా నాయక్ రికార్డును బ్రేక్ చేయకపోయినా ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్ వ్యూస్ విషయంలో మాత్రం రెండో స్థానంలో నిలవడం గమనార్హం. ఆర్ఆర్ఆర్ మూవీ తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా అన్ని థియేటర్లలో విడుదల కానుంది. ఆర్ఆర్ఆర్ మూవీకి రికార్డు స్థాయిలో బిజినెస్ జరగగా ఏ స్థాయిలో కలెక్షన్లు వస్తాయో చూడాలి. హిందీలో ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ ఆశించిన స్థాయిలో లేవు.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus