గతకొద్ది రోజులుగా సినిమా ఇండస్ట్రీని విషాదాలు వెంటాడుతున్నాయి.. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్‌తో పాటు.. కన్నడ, మలయాళ చిత్ర పరిశ్రమల్లో పలువురు మరణించారు.. ఆ వార్తలు మర్చిపోకముందే ఇప్పుడు మరో పాపులర్ నటి పరిస్థితి ప్రాణాంతకంగా ఉందని తెలియడంతో షాక్‌కి గురవుతున్నారు.. విచిత్రం ఏంటంటే.. ఆ నటి ఇప్పటికే రెండుసార్లు క్యాన్సర్ మహమ్మారిని జయించారు.. ఇప్పుడు మూడోసారి కూడా క్యాన్సర్ బారినపడి, హాస్పిటల్‌లో వెంటిలేటర్ మీద ప్రాణాలతో పోరాడుతున్నారు.. ఎవరా నటి.. వివరంగా చూద్దాం..
ఐంద్రీలా శర్మ.. బెంగాలీలో ఫేమస్ యాక్ట్రెస్.. చూడగానే ఆకట్టుకునే రూపం.. అంతే చక్కని నటనతో ఎంతోమంది ప్రేక్షకులని తన అభిమానులుగా మార్చేసుకున్నారు. ‘జుమూర్’, ‘భోలో బాబా పర్ కరేగా’ వంటి సినిమాలు ఆమెకు మంచి పేరు, స్టార్ డమ్ తెచ్చిపెట్టాయి.. మంచి ప్రాజెక్టులతో కెరీర్ విజయవంతంగా సాగి పోతుండగా ఉన్నట్టుండి క్యాన్సర్ బారిన పడ్డారు. అలా ఒక్కసారి కాదు.. రెండు సార్లు క్యాన్సర్‌తో పోరాడి విజయం సాధించారు. సాధరణంగా క్యాన్సర్ మహమ్మారి పేరు వింటేనే వణికిపోతుంటారందరూ..
అలాంటిది ఐంద్రీలా మనోధైర్యంతో పోరాడి గెలవడంతో అందరూ ఆశ్చర్యపోవడమే కాక.. క్యాన్సర్ బాధితులు ఆమెను స్ఫూర్తిగా తీసుకోవాలని భావించారు. ఇప్పుడు ఆమెకు స్ట్రోక్ రావడంతో.. ఆస్పత్రిలో చేర్పించారు. ఇంట్రా సెరిబ్రల్ హెమరేజ్ కారణంగా ఐంద్రీలా శర్మ శరీరంలో కొంత భాగం పక్షవాతానికి గురైందని వైద్యులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఆమె కోమాలోకి వెళ్లిందని.. మెదడులో అక్కడక్కడ రక్తం గట్టకట్టిందని వైద్యులు తెలిపారు.
పరిస్థితి విషమంగా ఉందని.. వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. ఐంద్రీలా శర్మ ఇంత చిన్న వయసులోనే ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం పట్ల బెంగాలీ సినీ వర్గాల వారు, అభిమానులు, ప్రేక్షకులు ఆందోళన చెందుతున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. గతంలో సోనాలి బింద్రే, మనీషా కోయిరాల, లీసారే వంటి బాలీవుడ్ నటీమణులు క్యాన్సర్ మహమ్మారితో పోరాడి గెలిచి.. ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు..