‘కే.జి.ఎఫ్'(సిరీస్) తో ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ గా ఎదిగాడు. ‘సలార్’ సినిమా ఆయన రేంజ్ ను ఇంకా పెంచింది. మరోపక్క ఎన్టీఆర్ కూడా ‘ఆర్.ఆర్.ఆర్’ తో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. మరి ఇలాంటి కాంబినేషన్లో ఓ భారీ పాన్ ఇండియా సినిమా రూపొందుతుంది అంటే అంచనాలు మామూలుగా ఉంటాయా? అది కూడా పీరియాడికల్ మూవీ కావడంతో స్కై ఈజ్ ది లిమిట్ అనే విధంగా అంచనాలు ఏర్పడతాయి అనడంలో సందేహం లేదు.
‘దేవర’ తో ఎన్టీఆర్ కి నామ మాత్రపు సక్సెస్ పడింది. తర్వాత చేసిన ‘వార్ 2’ తీవ్రంగా నిరాశపరిచింది. అందువల్ల ప్రశాంత్ నీల్ తో చేయబోయే సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు ఎన్టీఆర్. దాని కోసం ‘దేవర 2’ కి కూడా పక్కన పెట్టాడు.ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేయబోయే సినిమాకి ‘డ్రాగన్’ అనే టైటిల్ అనుకుంటున్నారు. ఇందులో స్టార్ క్యాస్టింగ్ ఉండబోతుంది అని ముందు నుండి వార్తలు వస్తూనే ఉన్నాయి.

దానిని నిజం చేస్తూ.. తాజా షెడ్యూల్లో బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో అనిల్ కపూర్ జాయిన్ అయినట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో ఆయన కూడా ఓ పవర్ఫుల్ రోల్ ప్లే చేస్తున్నాడట. ఆల్రెడీ ఈ కాంబోని ‘వార్ 2’ లో చూశాం. ఆ సినిమాలో ఎన్టీఆర్, అనిల్ కపూర్..లు పోలీస్ ఆఫీసర్స్ గా నటించారు. కాకపోతే ఆ సినిమాలో ఎన్టీఆర్ చివరికి నెగిటివ్ యాంగిల్లో కనిపించడం అనేది అభిమానులకు రుచించలేదు.
అయితే నీల్ సినిమాలో ఎన్టీఆర్- అనిల్ కపూర్..ల పాత్రలు అదిరిపోతాయని టాక్.
