పైరసీ వెబ్‌సైట్లు ఐబొమ్మ, బప్పం టీవీ నిర్వాహకుడు ఇమంది రవి గురించి ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారు. ఆయనను తెలంగాణ పోలీసులు అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకోవడంతో విచారణలో వెలుగులోకి వస్తున్నాయి. అందులో కొన్ని ఎవరూ ఊహించనివి, ఆశ్చర్యపరిచే విషయాలు బయటకు వస్తున్నాయి. అవన్నీ వింటుంటే ఆయన జీవితం ఓ సినిమాగా, వెబ్‌సిరీస్‌గా తీయొచ్చు అని అనుకున్నారు కొందరు. ఇప్పుడు వాళ్ల ఆలోచన నిజమవుతోంది. ఐబొమ్మ రవి లైఫ్ ఐరవిగా తీసుకురాబోతున్నారు.
Ibomma Ravi
సోషల్ మీడియాలో వీడియోలు, యూట్యూబ్ ఛానల్‌తో యూత్‌లో మంచి పేరు తెచ్చుకున్న ధీరజ్ శౌర్య అలియాస్ దొర సాయి తేజ ఈ ప్రాజెక్ట్‌తో దర్శకుడిగా మారబోతున్నాడు. ఈ విషయాన్ని ఆయన ఓ వారం క్రితమే అనౌన్స్ చేశారు. ఇప్పుడు ప్రాజెక్ట్ టైటిల్‌ని అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. ఇందులో ఇమంది రవి జీవితంలోని కీలక విషయాలగ గురించి చర్చిస్తామని దొర సాయి తేజ చెబుతున్నాడు. అయితే కేసు విచారణ సమయంలో ఏం చూపిస్తారనేది ఆసక్తికరం.
అయితే, ఈ ప్రాజెక్ట్ సినిమానా? లేక వెబ్‌సిరీసా? లేక వాళ్ల ఛానల్‌లో వచ్చే అవేర్‌నెస్, ఇన్ఫర్మేషన్ కంటెంట్ లాంటిదా అనేది తెలియాల్సి ఉంది. ఐరవి పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ ఇందులో ఉంటుంది అని పక్కగా చెప్పొచ్చు. రవి బాల్యం, కుటుంబం, జీవితంలో ఆటుపోట్లు లాంటి వివరాలు చెప్పబోతున్నారు. ఇవైతే ఆయన సొంత ప్రాంతంలో ఎవరైనా చెబుతారు. అయితే ఐబొమ్మను ఎలా మొదలుపెట్టాడు, ఇప్పుడు అరెస్ట్ వంటి అంశాలు డిస్కస్ చేయడం టూ ఎర్లీ అవుతుంది. కాబట్టి ఇది కాస్త రిస్కీ ప్రాజెక్టే.
అయితే, వారం క్రితం దొర సాయి తేజ చేసిన పోస్టులో అయితే ఇమంది రవి గురించి నిజాలు, ఈగో, కష్టాలు, పొందిన ప్రేమ, వెన్నుపోటు, సంపాదన, ఉన్నతి, పతనం లాంటివి ఈ ప్రాజెక్ట్‌లో చూపిస్తాం అని క్లియర్‌గా రాశాడు. దొర సాయి తేజ. రవి జీవితంలో చాలా షేడ్స్ ఉన్నాయి అనేది సాయితేజ మాట.. మరి ఏం చూపిస్తారో ఈ ప్రాజెక్టులో చూడాలి.