Andhra King Taluka Collections: నిరాశపరిచిన ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ ఫస్ట్ డే కలెక్షన్స్
- November 28, 2025 / 04:15 PM ISTByPhani Kumar
రామ్ పోతినేని(Ram Pothineni) హీరోగా మహేష్ బాబు.పి దర్శకత్వంలో ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ అనే సినిమా పీరియాడిక్ మూవీ రూపొందింది. భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర కూడా కీలక పాత్ర పోషించారు. మహేష్ బాబు పి దర్శకుడు. ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ పై నవీన్ ఎర్నేని, వై.రవి శంకర్ నిర్మించిన ఈ సినిమాకు వివేక్ మెర్విన్ సంగీతం అందించారు.
Andhra King Taluka
వారి సంగీతంలో రూపొందిన పాటలు అన్నీ చార్ట్ బస్టర్స్ అయ్యాయి. ఇక టీజర్, ట్రైలర్స్ వంటివి వాటికి కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక మొదటి రోజు సినిమాకి మంచి టాక్ వచ్చింది. కానీ ఓపెనింగ్స్ మాత్రం కొంత డిజప్పాయింట్ చేశాయి అనే చెప్పాలి.

ఒకసారి ఫస్ట్ డే కలెక్షన్స్ ని గమనిస్తే :
| నైజాం | 1.25 cr |
| సీడెడ్ | 0.25 cr |
| ఆంధ్ర(టోటల్) | 1.10 cr |
| ఏపీ + తెలంగాణ(టోటల్) | 2.6 cr |
| రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.20 cr |
| ఓవర్సీస్ | 1.20 cr |
| టోటల్ వరల్డ్ వైడ్ | 4 కోట్లు(షేర్) |
‘ఆంధ్రా కింగ్ తాలూకా'(Andhra King Taluka) చిత్రానికి రూ.25 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.25.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి రోజు ఈ సినిమాకి రూ.4 కోట్ల షేర్ వచ్చింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.21.5 కోట్ల షేర్ ను రాబట్టాలి. 2వ రోజు థియేటర్స్ అయితే పెంచారు. మరి కలెక్షన్స్ కూడా పెరుగుతాయేమో చూడాలి.













