మైనర్ బాలిక పై లైంగిక దాడులు చేయిస్తుందంటూ.. భానుప్రియ పై కేసు నమోదు..!

ప్రముఖ టాలీవుడ్ నటి భానుప్రియకి సంబంధించిన ఓ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. అప్పట్లో స్టార్ హీరోయిన్ గా ఓ వేలు వెలిగింది భానుప్రియ. కొన్ని వందల చిత్రాల్లో నటించిన భానుప్రియ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా రాణిస్తుంది. తాజాగా ఓ 14 ఏళ్ల అమ్మాయిని వేధిస్తున్నట్లు భానుప్రియ పై కేసు నమోదయ్యింది. తూర్పుగోదావరి జిల్లా…. సామర్లకోటకి చెందిన ప్రభావతి అనే మహిళ భానుప్రియ పై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదుచేసింది.

వివరాల్లోకి వెళితే… నిరుపేద కుటుంబానికి చెందిన ప్రభావతి కొందరు సలహా మేరకు తన 14 ఏళ్ళ వయసున్న కూతురిని చెన్నైలో భానుప్రియ ఇంటిలో పనికి పెట్టింది. అయితే మొదట్లో తన కూతురిని ఇంటికి పంపుతూ, ఫోన్ లో మాట్లాడిస్తూ బాగానే ఉండేవారట… కానీ ఇప్పుడు తన కూతురిని వేధిస్తున్నారంటూ ప్రభావతి తెలిపింది. ఒక సంవత్సరం నుండీ తన కూతురిని ఇంటికి పంపకుండా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. భానుప్రియ అన్న తన కుమార్తె పై లైంగిక దాడికి పాల్పడుతున్నాడని.. చేసిన ఆరోపణలు..ప్రస్తుతం సంచలనంగా మారింది. ఇప్పుడు చెన్నై చైల్డ్ హెల్ప్ లైన్ కు కూడా సమాచారం వెళ్ళిందట. భానుప్రియ లాంటి సీనియర్.. మరియు మంచి పేరున్న వాళ్ళు.. ఇలాంటి పనులు చేయడం పట్ల… సోషల్ మీడియాలో విమర్శలు చాలామంది విమర్శిస్తున్నారు. మరి ఈ ఆరోపణల పై భానుప్రియ ఎలా స్పందిస్తారో చూడాలి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus