Dasari Arun Kumar: అప్పు తీర్చమంటే.. చంపేస్తామని బ్లాక్ మెయిల్ చేశారట..!

దివంగత టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ మరియు రాజకీయ నాయకుడు అయిన దాసరి నారాయణరావు గారి కొడుకుల పై కేసు నమోదవ్వడం చర్చనీయాంశం అయ్యింది. అప్పు తీర్చమని కోరినందుకు… చంపేస్తామంటూ బెదిరించిన కారణానికి వీరి పై హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు ఫైల్ అయ్యింది.పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాకు చెందిన అట్లూరి సోమశేఖర్ రావు ఎల్లారెడ్డిగూడలో జీవనం కొనసాగిస్తుంటారు. ఆయనకి దాసరి నారాయణ రావు గారు అత్యంత సన్నిహితుడు.

అయితే దాసరి గారి ఆర్థిక పరిస్థితి బాగోలేనప్పుడు రూ. 2.10 కోట్లు సోమశేఖరరావు గారి దగ్గర నుండీ అప్పుగా తీసుకున్నారు. అయితే 2017లో దాసరి గారు అనారోగ్య కారణాలతో మరణించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 2018 వ సంవత్సరం నవంబర్ 13న దాసరి గారి కుమారులైన దాసరి ప్రభు, అరుణ్ లు రూ. 2.10 కోట్లకు బదులు రూ. 1.15 కోట్లు చెల్లించేందుకు అనంతరం పెద్దల సమక్షంలో అంగీకరించారు.

కానీ వాళ్ళు ఇచ్చిన మాటని నిలబెట్టుకోలేదట. ఇప్పటికీ వాళ్ళు డబ్బుని తిరిగి చెల్లించలేదని జూలై 27న జూబ్లీహిల్స్ రోడ్డు నంబరు 46లోని దాసరి గారి ఇంటికి సోమశేఖర్ రావు గారు వెళ్లారట. ఈ క్రమంలో ‘ఇంకోసారి డబ్బు కోసం ఇంటికి వస్తే చంపేస్తాము’ అంటూ ఆయన్ని బెదిరించారట దాసరి గారి కుమారులు. అందుకే ఆయన ప్రభు, అరుణ్ లపై పలు సెక్షన్ల కింద కేసు పెట్టినట్టు స్పష్టమవుతుంది.

Most Recommended Video

ఇష్క్ మూవీ రివ్యూ & రేటింగ్!
తిమ్మరుసు మూవీ రివ్యూ & రేటింగ్!
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus