సూర్య హీరోగా నటించిన ‘జై భీమ్’ చిత్రం గతేడాది అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. అయితే ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలు వన్నియర్ సామాజిక వర్గాన్ని కించపరిచేలా ఉన్నాయని ఆ సామాజిక వర్గం వాళ్ళు నిరసనకి దిగిన సంగతి తెలిసిందే. నిర్మాతలలో ఒకరైన జ్యోతిక,దర్శకుడు జ్ఞానవేల్ పై పోలీసులు కేసు నమోదు అయ్యాయి. ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలు వారిని విమర్శించే విధంగా ఉన్నాయని హీరో,
దర్శక నిర్మాతలపై కేసు నమోదు చేయమని అక్కడ స్థానిక పోలీస్ స్టేషన్‌లో రుద్ర వన్నియర్ సేన వ్యవస్థాపకుడు సంతోష్ ఫిర్యాదు చేయడం జరిగింది. కానీ పోలీసులు ఎవరి పై కూడా కేసు నమోదు చేయలేదు. దీంతో ఆయన సైదాపేట మేజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోర్టులో ఈ విషయం పై విచారణ జరిగింది. హీరో సూర్య, నిర్మాత జ్యోతిక దర్శకుడు టీజే జ్ఞానవేల్ పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి కోర్డుకు సమర్పించాలంటూ స్థానిక పోలీసులకు కోర్టు ఆదేశించింది.
దాంతో పోలీసులు హీరో సూర్య, జ్యోతికతో పాటు దర్శకుడు జ్ఞానవేల్ పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అంతేకాదు వన్నియర్ సంఘం సూర్య మరియు జై భీమ్ టీం పై రూ.5 కోట్ల పరువు నష్టం దాఖలు చేయడం జరిగింది. ఈ విషయంలో క్షమాపణలు కోరితే.. పరువు నష్టం ఉపసంహరించుకుంటామని వన్నియర్ సంఘం తెలిపింది.